క్రైమ్తెలంగాణ

కల్తీ మద్యం గుట్టు రట్టు...కేసు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్.


  • తయారీ దారుల అరెస్ట్.

  • పోలీసులకు చిక్కిన ఐదుగురు…పరారీలో మరో ఇద్దరు.

  • స్పిరిట్, కల్తీ మద్యం స్వాధీనం.


క్రైమ్ మిర్రర్, నల్గొండ బ్యూరో : నల్గొండ జిల్లాలో కలకలం సృష్టించిన కల్తీ మద్యం తయారీ కేసులో నల్గొండ పోలీసులు ఆదివారం ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరి నుండి 600 లీటర్ల స్పిరిట్, 600 లీటర్ల కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.


Also Read : ప్రియుడితో ఆ సుఖం కోసం ముగ్గురు కన్నబిడ్డలను ఉరి తీసింది 


ఈ కేసులో నిందితులైన ఐదుగురు చండూరు మండల కేంద్రానికి చెందిన వారు కాగా, ప్రధాన నిందితుడు బెంగళూరు, మరో నిందితుడు కనగల్ మండలం జి. ఎడవెల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. నిందితుల్లో ఎర్రజెల్ల రమేష్, శ్రీనివాస్ గౌడ్, మహ్మద్ జానీ పాషా, దోమలపల్లి యాదగిరి, బొమ్మరబోయిన భార్గవ్, సాయం ఉపేంద్ర, జాల వెంకటేష్ ఉన్నారు. కాగా ఈ నెల 6 వ తేదీన నాంపల్లి మండలంలో కల్తీ మద్యం తయారీ ఘటన వెలుగు చూడగానే దేవరకొండ ఏఎస్పీ మౌనిక ఆధ్వర్యంలో ప్రత్యేక టీం లను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ చెప్పారు.

సిబ్బందిని అభినందించిన ఎస్పీ…

కల్తీ మద్యం నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన ఏఎస్పీ మౌనిక, టాస్క్ ఫోర్స్ సీఐ రమేష్, ఎస్సై లు మహేందర్, శివప్రసాద్, నాంపల్లి సీఐ రాజు, ఎస్సై శోభన్ బాబు లను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు.

ఇవి కూడా చదవండి ..

  1. కదులుతున్న రైలు బాత్రూంలో అత్యాచారయత్నం!

  2. ప్రియునితో కలిసి.. కట్టుకున్న మొగున్నే కాటికి పంపిన భార్య..

  3. పాస్టర్ ప్రవీణ్ కేసులో ట్విస్ట్.. అసలు నిజం చెప్పబోతున్న పోలీసులు

  4. సభలోనే తెలంగాణ మంత్రిని బూతులు తిట్టిన మహిళలు

  5. నల్గొండ జిల్లాలో మహిళ దారుణ హత్య… మద్యం మత్తులో భార్యను నరికి చంపిన భర్త!..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button