అంగన్వాడీ కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

మర్రిగూడ,క్రైమ్ మిర్రర్:- నల్లగొండ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో, మహిళా శిశు సంక్షేమ పథకాల అమలు తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు, జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్, సోమవారం ప్రత్యేక చొరవ తీసుకున్నారు. మర్రిగూడ మండలంలోని సరంపేట గ్రామంలో ఉన్న, అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఆకస్మికంగా సందర్శించారు. ఈ తనిఖీ అంగన్వాడీ సిబ్బందిలో ఒక్కసారిగా కలకలం రేపినప్పటికీ, కలెక్టర్ కార్యనిర్వహణ తీరును క్షుణ్ణంగా పరిశీలించి పలు కీలక సూచనలు చేశారు.

గత రెండేళ్లుగా కేసీఆర్ ను తిట్టడమే మీ పని : కేటీఆర్

అంగన్వాడీ ​కేంద్రానికి వచ్చిన కలెక్టర్, అక్కడ ఉన్న గర్భిణీ స్త్రీలతో, బాలింతలతో నేరుగా ముచ్చటించారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న పౌష్టికాహారం సక్రమంగా అందుతుందా? పాలు, గుడ్లు, బాలామృతం, పంపిణీలో ఏవైనా జాప్యం జరుగుతుందా? అని అడిగి తెలుసుకున్నారు. రక్తహీనత నివారణకు ప్రభుత్వం అందిస్తున్న ఐరన్, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లను వాడాలని సూచించారు. తల్లీబిడ్డల ఆరోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందని, ప్రతి ఒక్కరూ ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

చిన్నారులతో సరదాగా..

​అంగన్వాడీలో ఉన్న చిన్నారులతో కలెక్టర్ ఎంతో ఆప్యాయంగా గడిపారు. పిల్లలకు నిర్వహిస్తున్న ప్రీ-స్కూల్ యాక్టివిటీస్‌ను స్వయంగా పర్యవేక్షించడమే కాకుండా, పిల్లలతో కొన్ని కృత్యాలు చేయించారు.​పిల్లల మేధో వికాసం కోసం ఆటపాటలతో, కూడిన విద్యను అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ​అనంతరం అటెండెన్స్ రిజిస్టర్లను తనిఖీ చేసి, పిల్లల హాజరు శాతం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సాంకేతికత వినియోగంపై ప్రశంసలు

అంగన్వాడీ ​కేంద్రంలోని రికార్డులను పరిశీలించిన కలెక్టర్, ముఖ్యంగా పోషణ్ ట్రాకర్ యాప్‌లో, డేటా ఎంట్రీ ఎఫ్.ఆర్.ఎస్, ద్వారా హాజరు నమోదు ప్రక్రియను పరిశీలించారు. సాంకేతికతను వినియోగించుకుంటూ పారదర్శకంగా విధులు నిర్వహిస్తున్న, అంగన్వాడీ టీచర్లను, సిబ్బందిని ఈ సందర్భంగా ఆయన అభినందించారు.

అధికారులకు హెచ్చరిక:-​కేంద్రం నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ, విధుల్లో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా సహించేది లేదని కలెక్టర్ కరాఖండిగా చెప్పారు.​ప్రభుత్వ లక్ష్యం ప్రతి పేద బిడ్డకు, గర్భిణీ, బాలింతలకు పౌష్టికాహారం చేరవేయడం. ఇందులో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, నాణ్యతలో రాజీ పడకుండా, చూడాల్సిన బాధ్యత క్షేత్రస్థాయి అధికారులదేనన్నారు. విధులకు గైర్హాజరైనా, స్టాక్ రిజిస్టర్లలో తప్పులు దొర్లినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
​ఈ తనిఖీ కార్యక్రమంలో కలెక్టర్ వెంట గ్రామ సర్పంచ్
​నక్క రాములమ్మ రవి, తహసీల్దార్ ​జక్కర్తి శ్రీనివాసులు, ఎంపిడివో జి.సి. మున్నయ్య, ఎంపీవో
​రవికుమార్, అంగన్వాడీ అధికారులు ​సక్కుబాయి, లావణ్య కుమారి,​వెంకటమ్మ, వైష్ణవి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button