తెలంగాణ

మునుగోడులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

మునుగోడు, క్రైమ్ మిర్రర్:- అకాల వర్షాలను దృష్టిలో ఉంచుకొని పత్తి రైతులు రెండు మూడు రోజులు ఆగి పత్తిని ఆరబెట్టుకుని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి విజ్ఞప్తి చేశారు. నల్గొండ జిల్లా, మునుగోడు మండల కేంద్రంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బాలాజీ కాటన్ ఇండస్ట్రీస్ లో ఏర్పాటుచేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు, మిల్లర్లతో ముఖాముఖి మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా పత్తిని కొనుగోలు చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, డిసిసిబి చైర్మన్లు పత్తి తేమ శాతాన్ని పరిశీలించారు. అంతేకాక తూకం యంత్రం ద్వారా తూకాన్ని పరీక్షించారు .తేమ 8 నుండి 12 శాతం లోపు ఉండేవిధంగా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కలెక్టర్ రైతులకు చెప్పారు.అనంతరం జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మునుగోడు పత్తి కొనుగోలు కేంద్రం అతి ముఖ్యమైందని,ఎల్ 1 సెంటర్ గా ఉన్న ఈ కేంద్రంలో గతంలో రైతులు ఇతర జిల్లాల నుండి పత్తిని తీసుకు వచ్చే వారని, అప్పుడు జిల్లా రైతులు పత్తిని అమ్మడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారని ,ఈ సంవత్సరం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్తగా కిసాన్ కపాస్ యాప్ ను ఏర్పాటు చేసిందని, ఈ యాప్ ద్వారా ముందుగా స్లాట్ బుక్ చేసుకున్న రైతుల పత్తి సరైన తేమ శాతంతో ,నాణ్యతా ప్రమాణాలతో ఉంటే అదేరోజు కొనుగోలు చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఒక సీజన్లో రైతు మూడు సార్లు స్లాట్ బుక్ చేసుకోవచ్చని, ఒకవేళ ఏదైనా కారణం చేత బుక్ చేసుకున్న స్లాట్ ను క్యాన్సల్ చేసుకోవచ్చని ,ఆ స్లాట్ అలాగే ఉంటుందని స్పష్టం చేశారు.

Read also : మనలాగే పాకిస్తాన్ కు గట్టి షాక్ ఇచ్చిన ఆఫ్ఘనిస్తాన్.. ఏంటంటే?

మునుగోడు కేంద్రంలో 19000 మెట్రిక్ టన్నుల పత్తిని కొనుగోలు చేసే సామర్థ్యం ఉన్నందున చుట్టుపక్కల రైతులకు పత్తి అమ్మకంలో ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. ఈ రెండు మూడు రోజులు రైతులెవరు స్లాట్ ను బుక్ చేసుకోవద్దని, వర్షాలు తగ్గిన తర్వాత స్లాట్ బుక్ చేసుకోవాలని, పత్తిని బాగా ఆరబెట్టి తీసుకురావాలన్నారు. ఒకవేళ వర్షంలో స్లాట్ బుక్ చేసుకుని వస్తే తేమ ఎక్కువగా ఉంటే తిప్పి పంపే అవకాశం ఉంటుందని, ఈ విషయంలో రైతులు పూర్తిగా సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నేడు రైతుల కళ్లలో ఆనందం కనిపిస్తుందనీ ప్రతి పత్తి రైతు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని, పత్తి తడి లేకుండా శుభ్రంగ ఉంచుకొని ప్రభుత్వ మద్దతు ధర పొందాలని సూచించారు.

Read this : చేతిపై సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న మహిళ వైద్యురాలు..!

రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్,చండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ దోటీ నారాయణ,కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారి బాలాజీ నింజె, చండూర్ ఆర్డీవో శ్రీదేవి, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ గోపి కృష్ణ ,మార్కెటింగ్ ఎడి ఛాయాదేవి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు కలెక్టర్ వెంట ఉన్నారు.అనంతరం జిల్లా కలెక్టర్ మునుగోడు మండలం, కచలాపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిఖంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రానికి ఇప్పటివరకు వచ్చిన ధాన్యం, అమ్మిన ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. వర్షాలను దృష్టిలో ఉంచుకొని ధాన్యం తడవకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, రైతులు కొనుగోలు కేంద్రం వద్దే ఉండి ధాన్యాన్ని టార్పాలిన్లతో కప్పి ఉంచాలని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button