
క్రైమ్ మిర్రర్,ఆత్మకూరు:- వే మేకర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల మొరిపిరాల పాఠశాల విద్యార్థులకు క్రీడలను ప్రోత్సహించే లక్ష్యంతో స్పోర్ట్స్ డ్రెస్‌లు, షూలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం పాఠశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించబడింది.ఈ సందర్భంగా ఫౌండేషన్ ఫౌండర్ వల్లూరి ఏసుదాస్ ముఖ్య అతిథిలు కావూరి సుధ సుజాత మాట్లాడుతూ, విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం, శారీరక దృఢత్వాన్ని అలవాటు చేయడం ఎంతో అవసరమని తెలిపారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని పేర్కొన్నారు. అలాగే పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.
ఐక్యతకు మారుపేరు రాంరెడ్డిపల్లి: సమస్య ఏదైనా ‘సై’ అంటున్న యువత
పాఠశాల ప్రధానోపాధ్యాయులు మజ్జిగ బాలరాజు మాట్లాడుతూ, వే మేకర్స్ ఫౌండేషన్ చేస్తున్న సేవలు అభినందనీయమని,ఈ తరహా కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తాయని అన్నారు. ఈ సహకారంతో విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అంభోజు దనమ్మ శంకరయ్య ,ఉపసర్పంచ్ యాస జనార్దనరెడ్డి, కార్యదర్శి రాఘవేంద్ర,ఏఏపీసీ చైర్మన్ కళమ్మ,ఫౌండేషన్ సభ్యులు వడపర్తి ఉదయ్,ఎండీ అలిమ్, సంబరాజు,వార్డు సభ్యులు, అఖిలపక్ష నాయకులు,మిత్ర యువజన సంఘం అధ్యక్షులు ముద్దసాని శ్రీనివాస్ గౌడ్,ఆదర్శ యూత్ అధ్యక్షులు యం మహేష్,మహిళా సంఘాల సభ్యులు,ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఏంటి అభి భాయ్.. 12 బంతుల్లోనే 50 చేయాల్సింది : యువరాజ్ సింగ్





