ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో పింఛన్ల పంపిణీ - స్వల్ప మార్పులు చేసిన ప్రభుత్వం

ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీలో స్వల్ప మార్పులు చేసింది ఏపీ ప్రభుత్వం. ఇప్పటి వరకు తెల్లవారుజామున నాలుగు, ఐదు గంటల నుంచి ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేసేవారు. వైసీపీ హయాంలో వాలంటీర్లు పింఛన్ల పంపిణీ చేస్తే…. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత… గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను ఇంటింటికీ పంపి పింఛన్లు పంపిణీ చేయిస్తున్నారు. అయితే… ఈసారి నుంచి పింఛన్‌ పంపిణీలో స్పల్ప మార్పులు చేసింది ప్రభుత్వం. తెల్లవారుజామున 4, 5 గంటల నుంచి కాకుండా… ఉదయం 7 గంటల నుంచి పింఛన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీని వల్ల.. అటు లబ్దిదారులకు, ఇటు… పంపిణీ చేసే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి మాత్రమే… పింఛన్ల పంపిణీ యాప్‌ పనిచేసేలా మార్పులు చేశారు.

లబ్దిదారులు ఇంట్లో లేకపోతే.. వారికి ఫోన్‌ చేసి దగ్గరలో ఉంటే.. అక్కడికి వెళ్లి పింఛన్లు ఇచ్చేవారు. ఈ విధానంలోనూ మార్పులు చేసింది ఏపీ ప్రభుత్వం. లబ్దిదారుల ఇళ్ల నుంచి 300 మీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్లి పింఛన్లు అందించాల్సి వస్తే… అందుకు కారణాలు ఏంటో… ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో.. వెంటనే యాప్‌లో నమోదు చేయాలని స్పష్టం చేసింది. పింఛన్ల లబ్దిదారులకు ప్రభుత్వం ఇవ్వాలనుకున్న సందేశాన్ని 20 సెకన్ల వీడియోగా రూపొందించి ఏపీ ప్రభుత్వం. ఈ వీడియాలో యాప్‌ ద్వారా లబ్దిదారులకు వినిపించనున్నారు. పింఛన్ల పంపిణీ చేసే సమయంలో లబ్దిదారుల వివరాలు నమోదు చేసిన వెంటనే… యాప్‌లో వీడియో ప్లే అయ్యేలా సెట్‌ చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ఉన్నందున కొన్ని జిల్లాల్లో మాత్రమే ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. రేపు మార్చి ఒకటో తేదీన… కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో పైలెట్‌ ప్రాజెక్ట్‌గా ప్రారంభిస్తారు. వచ్చే నెల (ఏప్రిల్‌) నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో… ఇదే విధానాన్ని అమలు చేయబోతున్నారు. లబ్దిదారులకు ఇంటింటికీ పింఛన్లు పంచుతూ… ప్రభుత్వ సందేశాన్ని లబ్దిదారులకు వినిపించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button