
మునుగోడు,క్రైమ్ మిర్రర్ :- మునుగోడు మండలంలోని సింగారం గ్రామంలో తెలంగాణ ప్రజా ప్రభుత్వం అర్హులైన వారికి మంజూరైన నూతన రేషన్ కార్డులు గ్రామపంచాయితీ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి కె.గీత, చండూర్ మార్కెట్ డెరైక్టర్ కుంభం చెన్నారెడ్డి, మాజీ సర్పంచులు పోగుల జానకి ప్రకాష్, జిల్లా లక్ష్మమ్మ వెంకటేష్, ఉప్పునూతల రమేష్, గుర్రాల పరమేష్, మాజీ ఉపసర్పంచ్ జంగం రాములు, గ్రామ పెద్దలు కుంభం భూపాల్ రెడ్డి, సోమగాని రమేష్, దేశెట్టి భద్రయ్య, పిట్టల రఘు, కుంభం సురేందర్ రెడ్డి, కారింగు అనిల్, జంగం చంద్రశేఖర్
తదితరులు పాల్గొన్నారు.
Read also : యాదాద్రి థర్మల్ ప్లాంట్ అభివృద్ధికి ప్రభుత్వం శరవేగంగా చర్యలు
Read also : నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా?.. అయితే ఇది మీకోసమే!