తెలంగాణ

డాన్స్ స్పోర్ట్స్ కమిటీ సభ్యులకు ఐడీ కార్డుల పంపిణీ

మిర్యాలగూడ, క్రైమ్ మిర్రర్ :-
తెలంగాణ డాన్స్ స్పోర్ట్స్ అసోసియేషన్‌ను రాష్ట్రంలోని యువ డాన్సర్లు ప్రొఫెషనల్ వేదికగా వినియోగించుకోవాలని ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ పిలుపునిచ్చారు.హైదరాబాద్ ఎస్సార్ నగర్‌లోని భాను వరల్డ్ స్టూడియోలో గణేష్ మాస్టర్‌ను నల్గొండ జిల్లా డాన్స్ స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మిర్యాలగూడ డివిజన్ అధ్యక్షుడు అలుగుబెల్లి వెంకట్‌ కు ఐడీ కార్డును గణేష్ మాస్టర్ అందజేశారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పాత బోయిన శేఖర్ నేతృత్వంలో నిర్వహించారు.ఈ సందర్భంగా గణేష్ మాస్టర్ మాట్లాడుతూ, “డాన్స్ స్పోర్ట్స్ అసోసియేషన్‌ జిల్లా, రాష్ట్ర స్థాయిలకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ప్రసారం అవుతున్న ప్రముఖ వేదిక. ఇందులో సభ్యత్వం పొందడం ద్వారా యువ డాన్సర్లకు ప్రతిభను ఆవిష్కరించుకునే అవకాశం లభిస్తుంది. ఇది ప్రొఫెషనల్ డాన్సర్లకు ఎంతో ఉపయోగపడుతుంది” అని తెలిపారు.అనంతరం గణేష్ మాస్టర్‌కు జిల్లా కమిటీ సభ్యులు శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో నల్గొండ జిల్లా సెక్రటరీ కలకొండ రాము, ట్రెజరర్ వీరు, మిర్యాలగూడ డివిజన్ నాయకులు ఏడు కొండలు, హనుమంతు, రాహుల్, శివ తదితరులు పాల్గొన్నారు.

క్లోజ్ అయిన శ్రీశైలం గేట్లు.. వెనుతిరిగిన ప్రయాణికులు!

అంధత్వం ఉన్న… వీరి గానం మాత్రం అద్భుతం! కూసింత పట్టించుకోండి?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button