
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 కు ఎంపికైనటువంటి అభ్యర్థులకు నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పాత్రలు అందజేయనున్నారు. ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాదులోని శిల్పకళా వేదికలో ఈ కార్యక్రమంలో జరుగుతుందని అధికారులు వెల్లడించారు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని దాదాపు 783 గ్రూప్ 2 ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తారని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా విభాగాల వారీగా ఖాళీగా ఉన్న పోస్టుల్లో వీరందరిని కూడా నియమించేలా విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అలాగే తదితర మంత్రులు పాల్గొననున్నారు. నేడు ఈ నియామక పత్రాలు అందుకోబోతున్న 783 మంది కూడా ప్రభుత్వంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నేడు ఉదయం నాలుగు గంటల నుంచి బీసీ సంఘాల నేతలు బంధు పేరిట రోడ్డు ఎక్కారు. అన్ని జిల్లాల్లో కూడా బస్సులు అలాగే షాపులన్నిటిని నడవకుండా అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇబ్బందు పూర్తయిన తర్వాత సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాదులోని శిల్పకళ వేదికలో 783 మంది అభ్యర్థులకు గ్రూప్ 2 నియామక పత్రాలు సీఎం రేవంత్ రెడ్డి అందజేయన్నారు.
Read also : తెల్లవారుజామునే రోడ్డు ఎక్కిన బీసీ సంఘాలు.. ఎవరికి వ్యతిరేకంగా ఈ బంద్?
Read also : హైదరాబాద్ లో తప్పని సిఎన్జి కష్టాలు.. క్రైమ్ మిర్రర్ నిఘాకి చిక్కిన బంకు యజమానుల చేతివాటం