
మహేశ్వరం,క్రైమ్ మిర్రర్ :-
మహేశ్వరం మండలం ఘట్టుపల్లి వీర హనుమాన్ ఆలయంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు గొల్లూరి రాజు ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ చేశారు ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధిగా మహేశ్వరం పోలీస్ స్టేషన్ సీఐ వెంకటేశ్వర్లు హాజరైనారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. వినాయక చవితి పండుగ సందర్భంగా మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించడం పర్యావరణానికి మంచిది మరియు స్థానిక కళాకారులకు ప్రోత్సహించినట్టు ఉంటుందని అన్నారు.గొల్లూరి రాజు మాట్లాడుతూ..ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు మట్టి వినాయకులను పెట్టాలని యూత్ కాంగ్రెస్ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ ప్రసాద్,కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఇమ్మడి ప్రవీణ్ పటేల్,ఆవుల రమేష్,మంత్రి బాలరాజ్,బొల్లు కుమార్,యూత్ కాంగ్రెస్ వివిధ గ్రామ శాఖల అధ్యక్షులు సుధాకర్, నాగేందర్, భాస్కర్, రవీందర్, రాజశేఖర్, ఆకాష్, విజయందర్,రాజు నాయక్, గణేష్ మరియు శ్రీకాంత్ పలువురు పాల్గొన్నారు.
Read also : ఖైరతాబాద్ గణేషుడి సన్నిధిలో మహిళ ప్రసవం
Read also : ఖైరతాబాద్ గణేషుడికి గవర్నర్ తొలిపూజ