
బాలానగర్, క్రైమ్ మిర్రర్:- అక్రమ నిర్మాణం పట్ల చర్యలు చేపట్టని అధికారులపై కోర్టు ధిక్కరణ కింద తప్పకుండా కేసు వేయాల్సి వస్తుందని కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎ బ్లాక్ ఉపాధ్యక్షుడు మాదిరెడ్డి యుగంధర్ రెడ్డి ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ పార్టీకి చెందిన బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి వినాయకనగర్ కాలనీలో అనుమతులకు మించి అక్రమంగా అదనపు అంతస్తులు నిర్మించారు. అక్రమ నిర్మాణం పట్ల చర్యలు తీసుకోవాలని పదే పదే కూకట్ పల్లి సర్కిల్ డిప్యూటీ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చెయ్యడం జరిగిందని పేర్కొన్నారు. సర్కిల్ అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో అప్పటి కూకట్ పల్లి జోనల్ కమిషనర్ అభిలాష అభినవ్ ను, ప్రస్తుతం అపూర్వ చౌహాన్ కు కూడా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చెయ్యడం జరిగిందని తెలిపారు.
Read also : భార్య పట్టించకపోతే ఐ బొమ్మ రవి దొరికేవాడా?.. సజ్జనార్ పై తీన్మార్ మల్లన్న ఫైర్!
అభిలాష అభినవ్ చర్యలు చేపట్టాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో హై కోర్టులో కేసు వేయాల్సి వచ్చిందని అన్నారు. నెల రోజుల్లో అక్రమ నిర్మాణంపై చర్యలు చేపట్టి కోర్టుకు తెలపాలని కోర్టు కోరింది. అప్పటికీ అధికారులు ఏ విధమైన చర్యలు చేపట్టకపోవడంతో కోర్టు ధిక్కరణ కింద కేసు వేయడం జరిగిందని తెలిపారు. సుమారు సంవత్సరం గడుస్తున్నా అక్రమ నిర్మాణం పట్ల చర్యలు తీసుకోవడంలో విఫలం అయ్యారని పేర్కొన్నారు. కూకట్ పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్ ను కలిసి అక్రమ నిర్మాణం పట్ల హైకోర్టు చెప్పిన మాటలను గుర్తు చేయడం జరిగిందని అన్నారు. అపూర్వ చౌహాన్ ఎట్టకేలకు స్పందించి కూల్చివేతలకు పోలీసు బందోబస్తును ఇవ్వాలని బాలానగర్ పోలీసులకు ఒక లేఖ కూడా రాశారు. కూకట్ పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్ మళ్ళీ ఒక లేఖను మళ్ళీ బాలానగర్ పోలీసులకు బందోబస్తు విషయంలో రాశారు. అక్రమ నిర్మాణం కూల్చివేసేందుకు అధికారుల నిర్లక్ష్య ధోరణి పట్ల అధికారుల మీద హై కోర్టులో కోర్టు ధిక్కరణ కింద కంటెంప్ట్ కేసు వేస్తానని తెలిపారు.
Read also : “స్టూడెంట్ అసెంబ్లీ” కార్యక్రమం.. ప్రత్యక్షంగా వీక్షించునున్న సీఎం





