
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్ :-
బాలకృష్ణ మరియు బోయపాటి కాంబినేషన్ లో రూపొందినటువంటి అఖండ-2 సినిమా కొన్ని వివాదాల కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. నిన్న రాత్రి సమయంలో ఈరోస్ సంస్థతో 14 రీల్స్ కు సానుకూల చర్చలు జరిగాయి అని తాజాగా సినీ వర్గాలు ప్రకటించాయి. ఇక ఇవాళ కోర్టులో ఈ విషయంపై విచారణలో కూడా ఇక వివాదాలు లేవు అని.. ఇద్దరి మధ్య చర్చలు కుదిరాయి అని కోర్టుకు తెలియజేయునన్నారు. ఇక ఇదే సమయంలో సినిమా విడుదలకు కోర్టు అనుమతులు తీసుకుంటుంది అని తెలిపారు. ఇక ఫ్యాన్స్ కోరిక మేరకు ఈనెల 12వ తేదీన అఖండ 2 సినిమా విడుదల చేయనున్నట్లు సినీ వర్గాల కీలక ప్రకటన చేశాయి. 12వ తేదీన సినిమా విడుదల, 11వ తేదీన ప్రీమియర్స్ ప్రదర్శించే అవకాశాలు ఉన్నట్లుగా స్పష్టత ఇచ్చారు. కాగా ఇవాళ ఉదయం 10:30 గంటలకు మద్రాస్ కోర్టులో ఈ సినిమా వివాదంపై విచారణ జరుగుతుంది. అన్ని అనుకున్నట్లుగా జరుగుతే 12వ తేదీన ఈ సినిమా పక్కాగా రిలీజ్ అవుతుంది అని సమాచారం
Read also : సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా : ఎస్పీ పవార్..
Read also : Gold RateToday: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులం ధర ఎంతంటే?





