తెలంగాణ

టూరిజం మేనేజ్‌మెంట్‌లో పిహెచ్.డి. అందుకున్న దినేష్ కుమార్ గట్టు

క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: చైతన్య (డీమ్డ్ టు బి యూనివర్సిటీ)లో మరో గర్వకారణమైన ఘట్టం చోటుచేసుకుంది. టూరిజం మేనేజ్‌మెంట్‌లో

క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: చైతన్య (డీమ్డ్ టు బి యూనివర్సిటీ)లో మరో గర్వకారణమైన ఘట్టం చోటుచేసుకుంది. టూరిజం మేనేజ్‌మెంట్‌లో విశేషమైన పరిశోధనతో డా.దినేష్ కుమార్ గట్టు పిహెచ్.డి. డాక్టోరల్ డిగ్రీని అందుకున్నారు. ఆయన చేసిన పరిశోధనా పత్రం పేరు ‘Tourist Perception, Attitude and Satisfaction Towards Amusement Parks in Telangana’. తెలంగాణ రాష్ట్రంలోని అమ్యూజ్‌మెంట్ పార్కులపై పర్యాటకుల అవగాహన, వైఖరి, సంతృప్తిపై మొదటిసారిగా సమగ్రంగా విశ్లేషించిన అధ్యయనంగా నిలిచింది. ఈ పరిశోధనను కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగం ప్రొఫెసర్ జి.విజయ్ పర్యవేక్షణలో పూర్తి చేశారు.

ఈ పరిశోధన వైవా-వోస్ పరీక్షకు పంజాబ్ యూనివర్సిటీ, చండీగఢ్‌కు చెందిన ప్రొఫెసర్ ప్రశాంత్ కుమార్ గౌతమ్ ఎక్స్‌టర్నల్ ఎగ్జామినర్‌గా విచ్చేసి, పరిశోధన నాణ్యతను విశ్లేషించి పిహెచ్.డి. డిగ్రీ ఇవ్వాలని సిఫార్సు చేశారు. ఆ సిఫార్సు మేరకు కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ ఫ్యాకల్టీ డీన్ ప్రొఫెసర్ సుగంధ దేవి అధికారికంగా డా.దినేష్ కుమార్ గట్టుకు డాక్టోరల్ డిగ్రీని ప్రకటించారు.

ఈ అధ్యయనంలో తెలంగాణలోని వినోద పర్యాటక రంగంపై (Leisure Tourism Sector) దృష్టి సారించి, పర్యాటకుల అభిప్రాయాలు, సంతృప్తి స్థాయిలను అంచనా వేసి, భవిష్యత్తులో అమ్యూజ్‌మెంట్ పార్క్‌లు మరింత ఆకర్షణీయంగా మారేందుకు అవసరమైన మార్గదర్శకాలను ప్రతిపాదించారు. పార్క్ ఆపరేటర్లు, డెస్టినేషన్ మార్కెటింగ్ సంస్థలు, విధాన నిర్ణేతలకు ఆచరణాత్మక సూచనలు అందించడం ద్వారా ఈ పరిశోధన భవిష్యత్తు పర్యాటక వ్యూహాల రూపకల్పనకు ఉపయుక్తంగా నిలుస్తుంది.

డాక్టోరల్ డిగ్రీ ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో చైతన్య యూనివర్సిటీ ఛాన్సలర్, వ్యవస్థాపకులు డా. సిహెచ్. వి. పురుషోత్తం రెడ్డి, డైరెక్టర్ మరియు చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డా. సిహెచ్. సాత్విక రెడ్డి, వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జి. శంకర్ లింగం, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.రవీందర్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ డీన్ ప్రొఫెసర్ క్రిస్టోఫర్, అడ్మినిస్ట్రేషన్ డీన్ ప్రొఫెసర్ ఎ. రాజు, సైన్స్ ఫ్యాకల్టీ డీన్ ప్రొఫెసర్ ఎస్.కవిత, అడ్మిషన్స్ డీన్ డా.సిహెచ్.ప్రత్యూష రెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ బి.రాజేందర్ రెడ్డి, హెచ్‌ఓడీ మరియు బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఛైర్‌పర్సన్ ప్రొఫెసర్ డా.టి.వి.జి.శాస్త్రి, పర్యవేక్షకులు ప్రొఫెసర్ జి.విజయ్, డిప్యూటీ కంట్రోలర్ ప్రొఫెసర్ ఇ.జగదీష్ కుమార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ & పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ గాదె రాంబాబు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ALSO READ: Business: ఎట్టకేలకు తగ్గిన బంగారం ధరలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button