
మద్దూర్, క్రైమ్ మిర్రర్ :-
నారాయణపేట జిల్లా కోస్గి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని జోగులాంబ డిఐజి ఎల్ ఎస్ చౌహన్ శుక్రవారం రోజు ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో పూల మొక్కల చెట్లు నాటారు. సీఐ సైదులు సిబ్బంది గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రిజిస్టర్లు తనిఖీ చేసి సిబ్బంది పనితీరు మరియు పరిసరాల పరిశుభ్రత కచ్చితంగా పాటించాలని వారికి వివరించారు. కోస్గి పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా మద్దూర్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసి అక్కడ చెట్లను నాటారు. అనంతరం ఎస్సై విజయ్ కుమార్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదు ధరలు ఎవరైనా ఫిర్యాదు చేసిన వెంబడే కేసు నమోదు చేసి వారికి తగు న్యాయం చేయాలని ఎస్ఐకి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్, కోస్గి సర్కిల్ ఇన్స్పెక్టర్ సైదులు, కోస్గి ఎస్సై బాలరాజ్, ఎస్సై 2 ఆంజనేయులు, మద్దూర్ ఎస్సై విజయ్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Read also : కనకదుర్గమ్మ సాక్షిగా తప్పుడు కథనాలను ఖండించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి!
Read also : గట్టుప్పల మండల అభివృద్ధిపై చర్చకు రావాలి