తెలంగాణ

కల్వకుంట్ల కవితకు శివన్నగూడెం ప్రాజెక్ట్ కనపడలేదా..?

మర్రిగూడ(క్రైమ్ మిర్రర్):- గత కొన్ని రోజుల క్రితం కల్వకుంట్ల కవిత, కిష్టరాయినిపల్లి ప్రాజెక్ట్ సందర్శన, ప్రస్తుతం మర్రిగూడ మండల కేంద్రంలో చర్చనియాంశంగా మారింది.. కూతవేటు దూరంలో ఉన్న శివన్నగూడెం ప్రాజెక్ట్ కి, ఆమె ఎందుకు రాలేకపోయారంటూ అనుకుంటున్నారు..

కవిత శివన్నగూడెం ప్రాజెక్ట్ కి రాకుండా, మండలంలో ఉన్న మాజీ మంత్రి హరీష్ రావు మనిషి అడ్డుకున్నట్లు తెలుస్తుంది.. బిఅర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ కూతురు అయినప్పటికీ, సొంత ఇంటిలో కుంపటిగా మారిన కవితకు, ఒక పక్క హరీష్ రావు, మరో పక్క కేటీఆర్ టార్గెట్ గా మారిన సంగతి రాష్ట్ర వ్యాప్తంగా అందరికి తెలిసిన ముచ్చటే.. కవిత పర్యటనలో శివన్నగూడెం ప్రాజెక్ట్ కూడా ఉన్నప్పటికి, మధ్యలో బ్రేక్ కావడంపై అనేక చర్చలకు దారి తీస్తుంది..

మండలంలో హరీష్ రావు మనిషి దేశ్ ముఖ్ ఈ పర్యటనను నిలుపుదల చేసినట్లు సమాచారం..? మరి హరీష్ రావు శివన్నగూడెం ప్రాజెక్ట్ సందర్శించి, అధికార పార్టీ నిర్లక్ష్యంపై ప్రశ్నించునున్నారా.. అందుకే కవిత పర్యటనకు ఆటంకం కలిగించారా అంటూ మండలంలో చర్చ జరుగుతుంది..

హరీష్ రావుకు అత్యంత సన్నిహితంగా ఉండే సదరు వ్యక్తి, తమ పార్టీ ప్రతినిధులతో మాట్లాడి ఈ సాహసం చేసినట్లు, కవిత సానుభూతిపరులను కూడా అక్కడికి వెళ్లకుండా ఆపారని ప్రచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button