
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఇండిగో సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో తాజాగా వైసీపీ నేత పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు దేశవ్యాప్తంగా కొన్ని వేలమంది ఈ విమానాలు ఆగిపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మీకు కనబడట్లేదా అని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పై పేర్ని నాని తీవ్రంగా మండిపడ్డారు. విమానా శాఖ మంత్రిగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు చేతగానితనం వల్ల ఈరోజు దేశం పరువు పోయింది అని వైసిపి నేత పేర్ని నాని తీవ్రంగా విమర్శించారు. ఒక కేంద్రమంత్రిగా తన శాఖ గురించి ఒకసారైనా లోతుగా పరిశీలించారా?.. అసలు ఆ శాఖలో ఏమేం జరుగుతుందా అనేది లోతుగా విచారణ చేశారా?.. అని ప్రశ్నించారు.
Read also : గిల్ కంటే సంజూ బెటర్.. సోషల్ మీడియాలో రచ్చ!
అసలు ఆయనకు విమానయాన అనే శాఖ ఎందుకు ఇచ్చారో కూడా అర్థం కావట్లేదు అని అన్నారు. ఏమైనా ప్రమాదాలు జరిగితే అక్కడికి వెళ్లి రీల్స్ చేసుకోవడానికి ఇచ్చారా?.. లేక ఏవైనా పెళ్లిళ్లు జరిగితే అక్కడికెళ్ళి డాన్సులు చేసుకోవడానికి ఇచ్చారా?.. అని వైసీపీ నేత నాని నిలదీశారు. ఈ 18 నెలల కాలంలోనే ఇండిగో తన ఫ్లైట్లు అలాగే రూట్లు కూడా పెంచుకుంటూ పోయింది అని.. మరి వాటి వివరాలను పరిశీలించకుండానే అనుమతులు ఎందుకు ఇచ్చారు?.. అని పేర్ని నాని వైసిపి పార్టీ కార్యాలయం నుండి ఈ విషయంపై నిలదీస్తూ పలు ప్రశ్నలు సంధించారు. ఇలాంటి అసమర్ధ వ్యక్తులను కూడా చంద్రబాబు నాయుడు వెనకేసుకు వస్తున్నారు అని ఆరోపించారు. ఏది ఏమైనా కూడా దేశవ్యాప్తంగా ఇండిగో విమానాలు ఆగిపోవడం వల్ల కొన్ని వేల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Read also : ఆ జలపాతం వైపు ఎవరూ వెళ్లొద్దు.. శబరిమల వెళ్లే భక్తులకు అటవీశాఖ సూచన!





