
క్రైమ్ మిర్రర్, పొలిటికల్ బ్యూరో :- రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. పాలిటిక్స్‌లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు అంటూ ఎవరూ ఉండరు. పరిస్థితులకు అనుగుణంగా వెళ్లిపోతుంటారు నేతలు. సమయానికి తగట్టు కండువాలు కూడా మార్చేస్తుంటారు. రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన వారు కూడా… మళ్లీ రీఎంట్రీ ఇవ్వొచ్చు. పాలిటిక్సే వద్దు అన్నవారు.. మళ్లీ ఏదో ఒక పార్టీలో చేరిపోవచ్చు. ప్రస్తుతం రాజకీయం అంటే ఇదే. ఇంత ఉపోద్గాతం ఎందుకంటే…? విజయసాయిరెడ్డి కోసం.
వైసీపీలో నెంబర్-2 స్థానంలో ఉన్న విజయసాయిరెడ్డి… ఆ పార్టీకి గుడ్‌బై చెప్పడం ఒక సంచలనం. జగన్ చుట్టూ ఉన్న కోటరీ వల్లే… బయటకు రావాల్సి వచ్చిందని చెప్పడం… మరో సంచలనం. ఆ తర్వాత.. జగన్‌కు అనుకూలం అంటూనే.. లిక్కర్ స్కామ్ విచారణలో…. దర్యాప్తు అధికారులు అడిగితే.. తనకు తెలిసిన వివరాలన్నీ ఇస్తాననడం ఇంకో సంచలనం. ఇవన్నీ జరిగిపోయిన తర్వాత.. మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి రీఎంట్రీ ఇస్తున్నారన్న వార్తలు రావడం.. మరీ మరీ సంచలనం. విజయసాయిరెడ్డి నిజంగానే మళ్లీ వైసీపీ చేరబోతున్నారా…? దానికి జగన్ ఒప్పుకుంటారా…? అంటే వార్తలు వస్తున్నాయే గానీ… స్పష్టత లేదు. వైసీపీలోకి విజయసాయిరెడ్డి రీఎంట్రీపై చర్చలు జరుగుతున్నాయని… ఓ కీలక నేత ఈ మంత్రాంగం నడుపుతున్నారని సమాచారం. వైసీపీలోకి విజయసాయిరెడ్డి వస్తే బాగుంటుందని.. ఆయన్ను పార్టీలోకి మళ్లీ ఆహ్వానిద్దామని జగన్ దగ్గర ప్రతిపాదన పెట్టారట. విజయసాయిరెడ్డి వస్తే తనకేమీ అభ్యంతరం లేదని కూడా జగన్ చెప్పినట్టు సమాచారం.
విజయసాయిరెడ్డి వైసీపీకి గుడ్‌బై్ చెప్పిన తర్వాత.. బీజేపీలో చేరిపోతారని తెగ ప్రచారం జరిగింది. బీజేపీ ఆయనకు గవర్నర్ పదవి ఇవ్వబోతుందని కూడా వార్తలు వచ్చాయి. కానీ… అలాంటిదేమీ జరగలేదు. విజయాసాయిరెడ్డి కమలం కండువా కప్పుకోలేదు. జగన్‌కు వ్యతిరేకంగా కూడా ఎక్కడా మాట్లాడలేదు. అందుకే.. విజయసాయిరెడ్డిని మళ్లీ వైసీపీలోకి తీసుకుంటే బాగుంటుందనే ప్రతిపాదన జగన్ ముందుకు వచ్చిందట. దీనికి జగన్ కూడా అంగీకరించారని చెప్తున్నారు. పార్టీ కీలక నేతలు దీనిపై విజయసాయిరెడ్డితో చర్చిస్తున్నారని.. అన్నీ అనుకూలంగా జరిగితే.. మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి ఎంట్రీ ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే.. ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం అవుతుంది.
వల్లభనేని వంశీకి వైసీపీలో కీలక పదవి – జగన్‌తో భేటీలో ఏం చర్చించారంటే..!