
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- ముఖేష్ కుమార్ దర్శకత్వంలో.. మంచు విష్ణు, మోహన్ బాబు ప్రధానపాత్రల్లో నటించినటువంటి డివోషనల్ సినిమా కన్నప్ప టీవీల్లో ప్రసారం కానుంది. దీపావళి పండుగ రోజున పురస్కరించుకుని ఈ సినిమాను టీవీల్లో ప్రసారం చేయనున్నారు చిత్ర బృందం ప్రకటించింది. అక్టోబర్ 19వ తేదీన జెమినీ టీవీలో మధ్యాహ్నం 12 గంటలకు ఈ సినిమా ప్రసారమవుతుంది అని అధికారికంగా సినిమా వర్గాలు ప్రకటించాయి. ఈ సినిమాకు ముఖేష్ కుమార్ దర్శకత్వం వహించగ మోహన్ బాబు స్వయంగా నిర్మించారు. కాగా ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మించగా అనుకున్న దాని కంటే ఎక్కువగానే వసూలు రాబట్టింది. దీనికి ముఖ్య కారణం ఒక వైపు భక్తి అయితే… మరోవైపు ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, బ్రహ్మానందం, కాజల్ అలాగే శరత్ కుమార్ లాంటి పలువురు ప్రముఖ నటులు నటించారు. అందుకే ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్లి మంచి వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా మంచు విష్ణు కెరీర్ లోనే ఒక అద్భుతమైన సినిమాగా పేర్కొన్నారు. కాగా ఎన్నో రోజుల తర్వాత దీపావళి పండుగ పురస్కరించుకొని ఈ సినిమా టీవీల్లో ప్రసారం కానుంది. దీంతో ఈ సినిమాను టీవీల్లో చూడడానికి కూడా ప్రజలు ఎదురుచూస్తున్నారు.
Read also : 18న గ్రూప్–2 నియామక పత్రాల వేడుక.. ముఖ్య అతిధిగా సీఎం
Read also : హైదరాబాద్ శివారులో రేవ్ పార్టీ కలకలం..!