
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రస్తుతం వాతావరణం పూర్తిగా మారిపోయింది. తెల్లవారుజాము నుంచి తిరుమల తిరుపతి క్షేత్రంలో భారీగా పొగ మంచు కమ్ముకొని ఒక కొత్త రకమైన ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది. కేవలం తిరుమల క్షేత్రమే కాకుండా స్వామి వారి ఆలయ చుట్టుపక్కల పరిసరాలు అలాగే ఘాట్ రోడ్లు అన్నీ కూడా దట్టమైన పొగ మంచుతో కొమ్ముకోవడమే కాకుండా ప్రకృతి ఆహ్లాదకరమైన తాండవం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఈ దట్టమైన పొగ మంచును చూసి ఆస్వాదిస్తున్నారు. మరి కొంతమంది ఈ దృశ్యాలను వీడియోలను తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఏడాది కూడా ఈ శీతాకాలంలోనే ఈ దృశ్యాలు ఏర్పడతాయని.. ఇంతటి ప్రకృతి సౌందర్యాన్ని కల్లారా చూస్తున్న భక్తులకు ఇంకేం కావాలి అని సోషల్ మీడియా వేదిక గా వారి వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. స్వామి వారి దర్శనం కోసం వెళ్ళినటువంటి భక్తులందరూ కూడా చలి కారణంగా వణికి పోతున్నారు. అయితే ఈ సందర్భంలోనే తిరుమల తిరుపతి క్షేత్రంలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది.. స్వామివారి సర్వదర్శనానికి కేవలం నాలుగు గంటల సమయం మాత్రమే పడుతుంది అని తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు వెల్లడించారు. కాబట్టి ఎవరైనా సరే తిరుమల క్షేత్రంలో ఇలాంటి ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యాన్ని చూడాలనుకుంటే త్వరగా క్షేత్రానికి బయలుదేరండి. ఆలయంలో దట్టమైన పొగ మంచు అలాగే విపరీతమైన చలి ఉన్న కారణంగా తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Read also : Supreme Court: అక్రమంగా వచ్చిన వారికి హక్కులేంటి? సుప్రీం సీరియస్!
Read also : 30 రోజుల్లోనే 10 మిలియన్ల ఫాలోవర్లను కోల్పోయిన రోనాల్డో.. కారణం ఇదే?





