
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్ :- కేరళలోని శబరిమల ఆలయానికి భక్తులు లక్షల సంఖ్యలో పోటెత్తుతున్నారు. కేవలం ఒక్క నెలలోనే ఏకంగా 25 లక్షల మంది భక్తులు అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నారు అని ఆలయ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం అయ్యప్ప స్వామి శరణు ఘోషతో శబరిమల ఆలయం మొత్తం కూడా మారు మోగిపోతుంది. గత నవంబర్ నెల నుంచి ఇప్పటివరకు కూడా 25 లక్షల పైగా భక్తులు స్వామివారి దర్శనం చేసుకోగా.. ప్రస్తుతం శబరిమల ఆలయం మొత్తం కూడా రద్దీగా మారిపోయింది.
Read also : బాలయ్య మజాకా.. మరో పాటకు సిద్ధమైన బాలకృష్ణ?
గత ఏడాది నవంబర్ 16వ తేదీ నుంచి డిసెంబర్ 16వ తేదీ వరకు 25 లక్షల మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకోగా ఈ ఏడాది ఇదే 30 రోజుల వ్యవధిలో ఏకంగా 25 లక్షలకు పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. ఇరుముడితో కొండాకోనలు దాటుకుంటూ చివరికి అయ్యప్ప స్వామిని దర్శించుకుని దీక్షను విరమిస్తూ ఉన్నారు. ఇప్పటికే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసినట్లుగా వెల్లడించారు. ఈ మండల పూజా మహోత్సవాలు ఈనెల 27వ తేదీతో ముగియనున్నాయి అని.. మరలా మకర జ్యోతి సమయానికి భక్తులు పోటెత్తే అవకాశాలు ఉన్నాయి అని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. అయితే ఏ ఏడాది లేనంతగా ఈ ఏడాది మాత్రం అధిక సంఖ్యలో అయ్యప్ప స్వామి మాలలు ధరించి తమ భక్తిని చాటుకున్నారు.
Read also : ఆహా ఎట్టకేలకు తగ్గిన నిరుద్యోగ రేటు.. PLFS కీలక నివేదిక వెల్లడి!





