Friday, March 20, 2026
Homeసినిమాఎల్లమ్మ సినిమాలో నటించడం పై క్లారిటీ ఇచ్చిన దేవిశ్రీ!

ఎల్లమ్మ సినిమాలో నటించడం పై క్లారిటీ ఇచ్చిన దేవిశ్రీ!

క్రైమ్ మిర్రర్,సినిమా న్యూస్:- జబర్దస్త్ వేణు డైరెక్షన్ లో టాలీవుడ్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ హీరోగా నటిస్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ సినిమా కు ఇప్పటికే ఎల్లమ్మ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అంతేకాకుండా తాజాగా వచ్చినటువంటి మూవీ గ్లింప్స్ కూడా ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్న విషయం కూడా అందరికి తెలిసిందే.కానీ ఈ సినిమాలో నేను హీరోగా నటించిడానికి పలు కారణాలు ఉన్నాయి అని తాజాగా దేవిశ్రీప్రసాద్ తెలిపారు. జబర్దస్త్ వేణు ఎల్లమ్మ సినిమా స్క్రిప్ట్ చెప్పడం మొదలుపెట్టిన కొద్ది క్షణాలకే ఆ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యాను అని.. ఐదు నిమిషాల్లోనే సినిమాలో నటించడానికి అంగీకరించాను అని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో సినిమాలలో నాకు నటించే అవకాశాలు వచ్చాయి కానీ ఆ సినిమా కథలలో నాకు అంత ఎక్సైటింగ్ అయ్యేటువంటి సబ్జెక్ట్ దొరకలేదు అని వెల్లడించారు. నేను ఇప్పటివరకు నటించినటువంటి ఫస్ట్ మూవీ దేవి అలాగే ఇప్పుడు నటిస్తున్నటువంటి ఎల్లమ్మ అనే ఈ రెండు సినిమాలు కూడా అమ్మవారి సినిమాలే కావడం చాలా సంతోషంగా ఉంది అని దేవిశ్రీప్రసాద్ తాజాగా జరిగినటువంటి ఉగాది ఈవెంట్ లో భాగంగా తెలిపారు.కాగా వేణు డైరెక్షన్ లో వచ్చినటువంటి బలగం సినిమా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. దీంతో ఎల్లమ్మ సినిమాపై కూడా ప్రేక్షకులకు భారీ అక్షరాలు ఉన్నాయి.

మున్సిపల్ కో ఆప్షన్ల వైపే అందరూ చూపు

PM Modi: పశ్చిమాసియాలో యుద్ధం.. ప్రధాని మోదీ కీలక దౌత్య చర్యలు!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments