క్రైమ్ మిర్రర్ తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అంజి: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాల’ వారోత్సవాలలో భాగంగా నేడు ఐదోవ రోజు వరంగల్ జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. సుమారు రూ. 531 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమాల అనంతరం జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆరు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తున్నషెడ్యూల్ (డిసెంబర్ 1-6, 2025):
డిసెంబర్ 1: మహబూబ్ నగర్ జిల్లా, మక్తల్.
డిసెంబర్ 2: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం.
డిసెంబర్ 3: కరీంనగర్ జిల్లా, హుస్నాబాద్.
డిసెంబర్ 4: ఆదిలాబాద్ జిల్లా, ఆదిలాబాద్.
డిసెంబర్ 5: వరంగల్ జిల్లా, నర్సంపేట (నేటి పర్యటన).
డిసెంబర్ 6: నల్గొండ జిల్లా, దేవరకొండ.





