ఆంధ్ర ప్రదేశ్

డిప్యూటీ సీఎం ఆదేశం.. వెంటనే ప్రారంభిస్తాను బాలినేని!

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాల మేరకు నడుచుకుంటానని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తాజాగా హైదరాబాదులో జరిగిన ఒక సినిమా వేడుకలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలానే వైరల్ అవుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు త్వరలోనే ఒంగోలులో డొక్కా సీతమ్మ పేరిట ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లుగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రకటించడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకే.. ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Read also : మిర్యాలగూడలో దారుణం – యువకుడి గొంతు కోసిన దుండగులు

ఇక ఒంగోలులో ఈ ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తారని… నిత్యం ప్రతిరోజు కూడా ఈ అన్నదాన ప్రక్రియ సాగుతుందని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఈ కార్యక్రమంలో భాగంగా తెలిపారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏం జరిగినా కూడా.. నాణ్యమైన భోజనాన్ని ఒంగోలు ప్రజలకు అందిస్తానని అన్నారు. ఈ ఐదు రూపాయల భోజనం కాకుండా… ఉచితంగానే.. నాణ్యమైనటువంటి భోజనం ప్రతి ఒక్కరికి అందిస్తానని అన్నారు. పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు కాబట్టే… వెంటనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. ఏదేమైనా కూడా పవన్ కళ్యాణ్ ప్రజల కోసం ఎంతగానో ఆలోచిస్తారని అన్నారు. ఆయన విధి విధానాలు నచ్చడం వల్లనే నేను కూడా పార్టీలో చేరాను అని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఏదేమైనా కూడా డొక్కా సీతమ్మ పేరిట ఎంతోమంది కడుపులు నింపడం అనేది మంచి నిర్ణయమే. అయితే పవన్ కళ్యాణ్ బాలినేనికి మాత్రమే ఒంగోలులో ఇలా చేయమని చెప్పడానికి కారణాలు ఏంటి అని ప్రతిపక్ష నేతలు ఆలోచిస్తున్నారు.

ఆపరేషన్ సిందూర్‌.. 13 మంది పాక్‌ సైనికులు హతం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button