
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఎర్రచందనం అనే పేరు వినగానే ప్రతి ఒక్కరికి కూడా పుష్ప సినిమా గుర్తుకు వస్తుంది. ఎందుకంటే ఆ సినిమాలో హీరో అల్లు అర్జున్ ఎర్రచందనం చెట్లను స్మగ్లింగ్ చేస్తూ విదేశాలకు అమ్ముకొని డబ్బులను సంపాదిస్తాడు. అయితే అదే స్టైల్ లో నేడు డిప్యూటీ స్థాయి హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తే వారి తాట తీస్తామని హెచ్చరించారు. చిత్తూరు జిల్లా అడవుల్లో దొరికేటువంటి ఎర్రచందనం చెట్లు సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి రక్తం నుంచే పుట్టినట్లు శాస్త్రాలు చెబుతున్నాయని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎర్రచందనం స్మగ్లింగ్ విపరీతంగా జరిగింది అని.. ఆ వివరాలు అన్నీ కూడా త్వరలోనే బయటపెడతామని పవన్ కళ్యాణ్ తెలిపారు. కాగా కేవలం తిరుపతి జిల్లాలోని మంగళం డిపోలో 2,60,000 దొంగలు ఉన్నాయి అని పేర్కొన్నారు. అయితే గత ప్రభుత్వంలో అక్రమంగా తరలిపోయింది దీనికి రెండింతలు ఉంటుందని ఆరోపించారు. కేవలం గత ఆరు సంవత్సరాల లోనే 1,30,000 చెట్లను నరికేశారు అని పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై ఎవరైనా సరే ఎర్రచందనం స్మగ్లింగ్ చేయాలని చూస్తే వారి అంతు చూస్తాము అని.. వారి ఆస్తులను కూడా తక్షణమే సీజ్ చేస్తాము అని హెచ్చరికలు చేశారు. అధికారులు కూడా ఎప్పటికప్పుడు వీటిపై నిగా ఉంచాలి అని సూచించారు. ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే వారికి సంబంధించినటువంటి ఏదో ఒక ఉద్యోగాలను ఏర్పాటు చేస్తాము కానీ.. దయచేసి ఎవరూ కూడా ఎర్రచందనం జోలికి వెళ్ళవద్దని సూచించారు.
Read also : ప్రచారానికి కొద్ది గంటల్లోనే తెరపడనుంది.. మరి నెగ్గేదెవరో?
Read also : జనసేన పార్టీ ని కూడా వదలని సైబర్ నేరగాళ్లు!





