ఉద్యోగుల హక్కుల కోసం త్యాగాలకు సిద్ధం …ఏఐటీయుసీ డిమాండ్
మంచిర్యాల, క్రైమ్ మిర్రర్ః రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బొగ్గుగని ఉద్యోగుల గురించి, మెడికల్ ఇన్వాలిడేషన్ నియమకాలపై చేసినటువంటి ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నామని ఏఐటీయుసీ బ్రాంచి కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, బాంచి వైస్ ప్రెసిడెంట్ భీమనాథుని సుదర్శన్, జాయింట్ సెక్రటరీ కంది శ్రీనివాస్ లు పేర్కొన్నారు.శనివారం ఏఐటీయుసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి సిం గరేణి ఉద్యోగుల మెడికల్ ఇన్వాలిడేషన్ పై సీబీఐ విచారణ చేపట్టాలని చెప్పడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు.
బొగ్గు గనుల ఉద్యోగుల త్యాగాలు మరువలేనివని స్వరాష్ట్ర సాధన కోసం సింగరేణి ఉద్యోగులు సకల జనుల సమ్మె చేస్తేనే స్వరాష్ట్రం ఏర్పడిందన్నారు. మెడికల్ అన్‌ఫిట్ అనేది కార్మికులకు దక్కిన దయ కాదని వారు సాధించుకున్న హక్కు అన్నారు. ప్రకృతికి విరుద్ధంగా బొగ్గుబావుల్లో దశాబ్దాల తరబడి పని చేసే ఉద్యోగులు ఏదో ఆనారోగ్యంపాలైతే మెడికల్ అన్ ఫిట్ అయిన వారి పిల్లలకు ఉద్యోగాల్లో అవకాశం కల్పిస్తున్నారని తెలిపారు. మెడికల్ అన్‌ఫిట్‌కు నిపుణులైన వైద్య నిపుణుల పర్యవేక్షణలో వారి రోగ నిర్ధారణ తీవ్రపతను బట్టి ఆన్‌ఫిట్ చేశారని తెలిపారు.
దీనిపై సీబీఐచే విచారణకు ఆదేశిస్తున్నామని మెడికల్ బోర్డును వదినెలలుగా నిలిపివేయడం దారుణమన్నారు. సింగరేణిలో ఇప్పటికే 300 మంది కిపైగా మెడికల్ ఇన్వాలిడేషన్ అయిన వారి పిల్లలు మెడికల్ అయి ట్రైనింగ్ కోసం ఎదురు చూస్తు న్నారని వారి కుటుంబాల పరిస్థితిని అర్ధం చేసుకోవాలన్నారు. సీబీఐ విచారణ పేరుతో ఉద్యోగుల భయ బ్రాంతులకు గురయ్యే విదానాన్నితాము సహించేదిలేదన్నారు.
ఇప్పటికైన విధానిన్న ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సింగరేని సంస్థ అభివృద్దికి ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేయాలే తప్ప. ఇలాంటి ప్రకటనలతో అయోమయానికి గురి చేయవద్దని అన్నారు. సింగరేణి ఉద్యోగుల హక్కుల కోసం తమ యూనియన్ ఎలాంటి త్యాగాలకైన సిద్ధంగా ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు పెద్దపల్లి భానయ్య, సీవి రమణ, గాండ్ల సం పత్, శ్రీనివాస్, కుమార స్వామి టేకు మట్ల తిరుపతి పాల్గొన్నారు
