
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- మన దేశ రాజధాని ఢిల్లీలో ఏదైనా సమస్య ఉంది అంటే అది కచ్చితంగా గాలి కాలుష్యమే. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ప్రతిరోజు కూడా క్షీణిస్తూ ఉంది. ఢిల్లీలోని ప్రతి గల్లీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ గాలి కాలుష్యం వల్ల విపరీతమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఢిల్లీలోని ప్రజలందరూ కూడా ఊపిరి తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న వార్తలు ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. ఈరోజు తెల్లవారుజామున దాదాపు ఢిల్లీలోని 20 జోన్లలో AQI 400 పాయింట్లు నమోదు కావడంతో PCB తీవ్రమైన కేటగిరీగా పేర్కొంది. దీంతో ప్రజలందరూ మరోసారి భయాందోళనకు గురవుతున్నారు. ఒక దేశ రాజధాని లో గాలి కాలుష్య కోరలు కమ్ముతుంటే ఎవరూ పట్టించుకోరు ఏంటి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గాలి కాలుష్య నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదంటూ ఢిల్లీలో చాలామంది కూడా నిరసనలు చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే నిన్న సాయంత్రం మరి కొంతమంది ఢిల్లీ గేట్ వద్ద ఆందోళనకు దిగడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాధికారులు స్పందించి కఠినమైన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఢిల్లీ లో రోగాల బారిన పడిన ప్రజలు ఎక్కువగా ఉంటారు అని చాలామంది హెచ్చరిస్తూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ కాలుష్యం పై ప్రభుత్వం మరోసారి ఎలాంటి చర్యలు తీసుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.
Read also : సౌత్ ఆఫ్రికా తో భారత్ ఢీ.. కెప్టెన్, జట్టు పూర్తి వివరాలు ఇవే!
Read also : రాజకీయ నేతల వాట్సప్ గ్రూపులు హ్యాక్.. కీలక సూచనలు చేసిన సైబర్ క్రైమ్!





