
హైదరాబాద్ వనస్థలిపురంలో విషాదం జరిగింది. ఓ తల్లి రెండేళ్ల కుమారుడితో కలిసి సూసైడ్ చేసుకుంది. కొడుకును పట్టుకుని బిల్డింగ్ పై నుంచి దూకేసింది. ఈ ఘటనలో తల్లి స్పాట్ లో చనిపోగా.. గాయాలపాలైన బాలుడు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. బంగారం చోరీ అవడంతో మనస్తాపానికి గురై తన రెండున్నరేళ్ల కుమారుడితో బిల్డింగ్ పైనుండి దూకి ఒక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలోని చింతల కుంట లో చోటుచేసుకుంది.
సుధేష్ణ అనే వివాహిత ఈ నెల 16న బంధువుల శుభకార్యానికి వెళ్లగా,తన ఏడు తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి,అవి ఇప్పటి వరకు దొరకకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సుధేష్ణ..నిన్న మంగళవారం తన రెండున్నరేళ్ల కుమారుడు ఆరుష్ కుమార్‌తో పాటు తన ఇంటి మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య కి పాల్పడింది. ఈప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సుధేష్ణ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా బాబు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.