దేశ రాజధాని ఢిల్లీ అత్యంత ప్రమాదకరస్థాయిలో ఉంది. రాజధానిలో గాలి పీల్చుకుని బతికే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. ఎయిర్ క్వాలిటీ రోజురోజుకూ దారుణంగా పడిపోతుంది. స్టేజ్-4 దశలోకి ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ వచ్చేసింది. ఈ సీజన్లో ఫస్ట్ టైం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ డేంజర్ మార్క్ దాటేసింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం 401 నుంచి 450 మధ్య ఎయిర్ క్వాలిటీ ఉంటే గాలి కాలుష్యం తీవ్రంగా ఉన్నట్టే. అలాంటిది ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో AQI 462గా రికార్డయింది. ఢిల్లీలో ఏకంగా 462 నమోదయిందంటే దేశ రాజధాని నగరంలో వాయు కాలుష్యం ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు
AQI 462గా నమోదు కావడంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. గ్రాండ్ లెవెల్‌లో పలు సవరణలు అమలులోకి తీసుకొచ్చింది. ఢిల్లీ ప్రభుత్వం నేటి నుంచి కొన్ని ఆంక్షలు విధించింది. డీజిల్ వాహనాల రాకపోకలను నిషేదించింది. సీఎన్జీ, బీఎస్-6 డీజిల్ వాహనాలు లేదా ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే అనుమతించాలని నిర్ణయించింది. స్కూళ్లు, ఆఫీసుల కార్యకలాపాలపై కూడా ఆంక్షలు విధించింది. 6 నుంచి 9 తరగతులు చదివే విద్యార్థులకు, 11వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని ఆదేశాలిచ్చింది. ఎన్సీఆర్ పరిధిలో కార్యకలాపాలు సాగిస్తున్న ఆఫీసులు 50 శాతం స్టాఫ్తో మాత్రమే నడవాలని, మిగిలిన 50 శాతం ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఢిల్లీలో గాలి కాలుష్యాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసి ప్రజలను అలర్ట్ చేసేందుకు ఎయిర్ క్వాలిటీ రీడింగ్స్ మానిటరింగ్ స్టేషన్లను 34 నుంచి 40కి పెంచింది.కాలుష్యం డేంజర్ లెవల్ లో ఉండటంతో ఢిల్లీ ప్రజలు వణికిపోతున్నారు. ఇండ్ల నుంచి బయటికి రావడానికి బయపడుతున్నారు. మరికొందరు తమ పిల్లలను తీసుకుని ఇతర ప్రాంతాలకు వెళుతున్నారు. కాలుష్య తీవ్రత కొంత తగ్గాకా తిరిగి వస్తామని చెబుతున్నారు.
మరిన్ని వార్తలు చదవండి ..
కొడంగల్ నీ అయ్య జాగీరా.. పోయేకాలమే బిడ్డా..రేవంత్ పై రెచ్చిపోయిన జేజమ్మ
రియల్ ఎస్టేట్‌లో మరో మోసం.. నిండా ముంచిన సువర్ణ భూమి
రేవంత్ మరో సంచలనం.. ట్యాక్స్, రిజిస్ట్రేషన్ చార్జీలు మాఫీ
తెరుచుకున్న శబరిమల ఆలయం.. ఆన్ లైన్ లో దర్శనాల బుకింగ్స్
చెత్తకుప్పల్లో కులగణన సర్వే పత్రాలు.. ఆందోళనలో జనాలు
ప్రధాని మోడీకి తప్పిన గండం.. బీజేపీలో కలవరం
మహిళలకు అర్దరాత్రి పోలీసుల వేధింపులు..రేవంత్‌కు పుట్టగతులుండవ్!
కేటీఆర్.. నీ బొక్కలు ఇరుగుతయ్.. పీసీసీ చీఫ్ వార్నింగ్
కేటీఆర్ ఇంటి దగ్గర అర్ధరాత్రి టెన్షన్
ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఒరిజినల్ కాంగ్రెస్ నేత అర్ధనగ్న ప్రదర్శన
ఢిల్లీలో కాళ్లు మొక్కుతున్న కేటీఆర్! పొంగులేటి దగ్గర పక్కా ఆధారాలు.
కొడంగల్ అధికారిపై దాడి.. 300 మంది రైతులు అరెస్ట్
సమగ్ర సర్వే సిబ్బంది పైకి కుక్కలు..వణికిపోతున్న టీచర్లు
ఔలా గాళ్ల సంఘం అధ్యక్షుడిగా కేటీఆర్!
రైతులకు గండం.. వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు