
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- మన దేశ రాజధాని ఢిల్లీలోని ప్రజలు నాణ్యతలేని గాలి కారణంగా అనారోగ్య సమస్యలకు గురైతున్నారు. కొన్ని నెలలు తర్వాత దేశ రాజధాని ఢిల్లీ ప్రజలు ఇవాళ కాస్త స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటున్నారు. దానికి గల కారణాలు ఏంటంటే గత కొద్ది రోజుల నుంచి వర్షాలు అలాగే గాలి వేగం పెరగడంతో ఢిల్లీలో వాయు కాలుష్యం తగ్గి గాలి నాణ్యత కాస్త మెరుగుపడింది. ఇవాళ సగటున AQI 249 పాయింట్లుగా నమోదయినట్లు అధికారులు వెల్లడించారు. ఎయిర్ క్వాలిటీ క్షీణించడంతో గత కొన్ని నెలలుగా ఢిల్లీ పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. నిన్న, మొన్నటి నుంచి ఢిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలతో పాటు మంచు కూడా ఎక్కువగా కురవడం వల్ల పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయి. ఏది ఏమైనా కూడా ఉన్నతాధికారులు ఈ విషయంపై ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటే తప్ప ఢిల్లీ పరిసర ప్రాంత ప్రజలు అనారోగ్య సమస్యలకు గురి కాకుండా ఉంటారు.
Read also : ఇంట్లో ఎవరూ లేరని ప్రియుడిని పిలిచిన యువతి.. తర్వాత షాక్ (VIDEO)
Read also : RRB: రైల్వేలో 22 వేల ఉద్యోగాలు.. టెన్త్ అర్హత ఉంటే చాలు!





