జాతీయం

Delhi Blast: ఢిల్లీ బ్లాస్ట్ కేసు, ముంబైలో ముగ్గురు నిందితుల అరెస్ట్!

ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులకు..ఈ కేసుతో ముంబై లింక్ ఉన్నట్లు గుర్తించారు. తాజాగా ముంబైలోని ముగ్గురు అనుమానితులను అరెస్ట్ చేశారు.

Delhi Bomb Blast Case: ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులో తీగ లాగినా కొద్ది కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు విచారణ కొనసాగిస్తున్న ఎన్ఐఏ అధికారులకు ఈ కేసుతో పలు రాష్ట్రాలకు లింకు ఉన్నట్లు గుర్తించారు. జమ్మూకాశ్మీర్, హర్యానా సహా పలు ప్రాంతాల్లో కీలక నిందితులను అరెస్ట్ చేశారు. తాజాగా ఈ కేసుకు ముంబైతో లింక్ ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో  ముంబైలోని పలు ఎన్ఐఏ తాజాగా సోదాలు నిర్వహించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురు ఉన్నత కుటుంబాలకు చెందిన, బాగా చదువుకున్న వ్యక్తులుగా గుర్తించారు. ముంబై పోలీసులు సాయంతో ఈ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. అరెస్ట్ చేసిన నిందితులను విచారణ కోసం ఢిల్లీకి తరలించారు.

సోషల్ మీడియా ద్వారా సంప్రదింపులు

ముంబైకి చెందిన ముగ్గురు నిందితులు ప్రధాన నిందితుడు అయిన నబితో మొబైల్ యాప్ ద్వారా సంప్రదింపులు కొనసాగించినట్లు గుర్తించారు. కీలకమైన సమాచారాన్ని పంచుకునేందుకు వారు ఆ యాప్ వాడినట్టు భావిస్తున్నారు. వీరు విచారణలో చెప్పే విషయాలను బట్టి మరికొన్ని అరెస్టులు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ముంబై పోలీసుల సాయంతో మహారాష్ట్రలోని వివిధ జిల్లాల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ఇద్దరు మహిళా డాక్టర్లు సహా పలువురు అరెస్ట్

ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కు సంబంధించి వైట్ కాలర్ ఉగ్ర నెట్ వర్క్ తో సంబంధం ఉన్న పలువురు నిందితులను దర్యాప్తు అధికారులు అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు మహిళా డాక్టర్లతో పాటు మరో 8 మంది టెర్రర్ డాక్టర్లను పట్టుకున్నారు. వారి విచారణ ద్వారా మరికొంత మందిని అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 15 మందికి పైగా నిందితులను అరెస్ట్ చేశారు. త్వరలో మరికొంత మందిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button