
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- విద్యార్థులు చదువుతున్నటువంటి విద్యపై ఎలాంటి ఉపయోగం లేదు అని తాజాగా లోకసత్తా పార్టీ చీఫ్ జయప్రకాష్ నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. మనదేశంలో డిగ్రీ పట్టాలు చిత్తు కాగితాలతో సమానము అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం లక్ష రూపాయలు ఖర్చు చేస్తున్న కూడా కనీస విద్యా ప్రమాణాలు అందడం లేదు అని జయప్రకాశ్ నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. 90 శాతం సర్టిఫికెట్లు నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావు అని తాజాగా జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏదైనా సరే ఒక సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు స్కిల్ లేకుండా పట్టాలు ఉండి ఏం లాభం అని ప్రశ్నించారు. కొన్ని లక్షల మంది ప్రతి ఏడాది పాస్ అవుతూ వస్తూ ఉన్నారు. కానీ వారిలో వందమందికి మాత్రమే సబ్జెక్టు పై మినిమం నాలెడ్జి ఉంటుంది అని.. ఇక మిగతా వారికి ఎటువంటి నాలెడ్జ్ ఉండడం లేదు అని అతను తెలిపారు. 100% మంది పరీక్షలు రాస్తున్న సందర్భంలో 20 శాతం మంది మాత్రమే ఆ సబ్జెక్టు పై స్కిల్స్ ఉంటున్నాయి అని… అందుకే ప్రస్తుత కాలంలో విద్యార్థులు ఉద్యోగాలు సంపాదించలేకపోతున్నారు అని అన్నారు. ఎన్ని డిగ్రీ పట్టాలు చేతిలో ఉన్నా కూడా అవి కొంచెం కూడా పనికిరావు అని… స్కిల్స్ ఉంటేనే ఉద్యోగాలు సంపాదించగలరు అని అన్నారు. మరోవైపు వివిధ రంగాలలో యువత ఎక్కువగా పోటీపడాలి అని… అందరూ కూడా ఒకేరంగంపై ఎదగాలన్న ఆలోచనలను మానుకోవాలని సూచించారు. అన్ని రంగాలలో యువత ముందుండాలి అని… అప్పుడే జీవితంలో మంచి వెలుగులు పొందగలరు అని తెలిపారు.
Read also : డేంజరస్ గా తుఫాన్లు.. ఈ మూడు దేశాల్లోనే 1100 మంది మృతి!
Read also : డైరెక్టర్ తో సమంత పెళ్లి.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రూమర్స్!





