
ములుగు జిల్లా,క్రైమ్ మిర్రర్:- సాధారణ కుటుంబానికి చెందిన ఒక అమ్మాయి కృషితో సాధించిన విజయమిది. మైలాంపల్లి మండల కేంద్రానికి చెందిన అల్లెపు మౌనిక రాష్ట్ర ప్రభుత్వ గ్రూప్-1 పరీక్షల్లో మెరిసి 315వ ర్యాంక్ సాధించింది. తాజాగా ప్రభుత్వం ప్రకటించిన ఫలితాల్లో ఆమె డీఎస్పీగా ఎంపిక కావడం గర్వకారణం. మౌనిక తండ్రి అల్లెపు సమ్మయ్య ఒక చిన్న టైర్ పంచర్ షాపు నడుపుతూ కుటుంబాన్ని పోషించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, చదువులో ప్రతిభ కనబరిచిన మౌనికకు కుటుంబం ఎల్లప్పుడూ తోడ్పడింది. అదే పట్టుదలతో ఆమె కృషి చేసి, తొలి ప్రయత్నంలోనే గ్రూప్-1 పరీక్షల్లో విజయాన్ని సాధించడం విశేషం.
Read also : స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై పూర్తి అవగాహన అవసరం – జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
ఆమె విజయం పల్లెల్లో చదువుతున్న విద్యార్థులకు ఒక స్ఫూర్తిదాయక ఉదాహరణ. “అవకాశాలు పట్టుదలతో కలుస్తాయి” అనే మాటను మౌనిక సాక్షాత్కరించింది. స్థానికులు మౌనిక విజయంపై సంతోషం వ్యక్తం చేస్తూ, ఆమె భవిష్యత్తు మరింత వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తున్నారు.
Read also : ఆసుపత్రుల పరిశుభ్రతపై ప్రశ్నలు.. ఆకస్మిక తనిఖీపై విమర్శలు..!