క్రైమ్తెలంగాణ

సర్పంచ్ పదవి కోసం తండ్రిని చంపించిన కూతురు..

సూర్యాపేట జిల్లాలో దారుణ ఘటన జరిగింది. రాజకీయాల్లో ఆధిపత్యం కోసం సొంత తండ్రినే హత్య చేయించింది కూతురు. ఈనెల 17న జరిగిన కాంగ్రెస్ నాయకుడి హత్య కేసులో 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మామ అల్లుడు ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాని రెండు గ్రూపులుగా ఉన్నారు. దీంతో తన భర్త పదవులకు అడ్డు వస్తున్నాడనే కారణంతో కన్న తండ్రిని హత్య చేయించింది కూతురు.

సూర్యాపేట జిల్లా నూతన్‌కల్ మండలం మిరియాల గ్రామంలో ఈ 17న మాజీ సర్పంచ్, కాంగ్రెస్ సీనియర్ నేత చక్రయ్య గౌడ్ హత్యకు గురయ్యారు. ఈ కేసులో చక్రయ్య గౌడ్ సొంత కూతురు, అల్లుడు సహా 11 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. గ్రామంలో రాజకీయ ఆధిపత్యం, వర్గ విభేదాలే చక్రయ్య గౌడ్ హత్యకు కారణమని తెలిపారు పోలీసులు. గ్రామంలో 30 సంవత్సరాలు సర్పంచ్, సహకార సంఘం చైర్మన్ పదవులు చేశారు చక్రయ్య గౌడ్. దీంతో తనకు వైరి వర్గంగా మారిన మామ చక్రయ్య గౌడ్‌ను అల్లుడు అంతమొందించాడని తెలిపారు పోలీసులు.

చక్రయ్య గౌడ్ గత పదేళ్లు అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఆయన అల్లుడు కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. అయితే చక్రయ్య గౌడ్ .. మందుల శామేలు వర్గంలో ఉండగా.. అల్లుడు ఎమ్మెల్యే గాదరి కిశోర్ వర్గంలో పని చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు కాంగ్రెస్ పార్టీలో చేరాడు చక్రయ్య గౌడ్. అల్లుడు మాత్రం బీఆర్ఎస్ లోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆయన కూడా కాంగ్రెస్ లో చేరాడు. దీంతో మామ, అల్లుళ్లు ఇద్దరు మళ్లీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. అయితే చక్రయ్య గౌడ్ ఎమ్మెల్సే మందుల శామేలు వర్గంలో ఉండగా.. కూతురు-అల్లుడు మాత్రం ఆయన వ్యతిరేక వర్గంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య గొడవ జరుగుతోంది. ఈ క్రమంలోనే తండ్రి చక్రయ్య గౌడ్ న హత్య చేయించింది సొంత కూతురు. ఈ మర్డర్ కేసు విషయాన్నే అసెంబ్లీలో లేవనెత్తారు ఎమ్మెల్యే శామేలు.

ఇవి కూడా చదవండి .. 

  1. ప్రేమించిన యువతి మృతి చెండడంతో- మనస్థాపంతో యువకుడి ఆత్మహత్యయత్నం

  2. ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్.. ప్రభాకర్ రావు సంచలనం

  3. ఐదుగురు నన్ను లైంగికంగా వేధించారు- కన్నీరుపెట్టుకున్న వరలక్ష్మీ శరత్‌కుమార్‌

  4. హయత్ నగర్ లో రోడ్డు ప్రమాదం.. అడిషనల్ ఎస్పీ దుర్మరణం

  5. TollyWood: టాలీవుడ్‌ మెడకు బెట్టింగ్‌ ఉచ్చు – త్వరలోనే ప్రముఖుల అరెస్ట్‌..?

One Comment

  1. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు కాంగ్రెస్ పార్టీలో చేరాడు చక్రయ్య గౌడ్. అల్లుడు మాత్రం బీఆర్ఎస్ లోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆయన కూడా కాంగ్రెస్ లో చేరాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button