
-ఆదమరిస్తే …ఇక అంతే సంగతి…
-ప్రమాద కరణంగా ఉన్న కల్వర్ట్ పట్టించుకొని అధికారులు
-ప్రమాదపుటంచుల్లో ప్రయాణం,భయ బ్రాంతులకు గురవుతున్న వాహన దారులు
నిఘా వ్యవస్థ నిద్రిస్తే….. క్రైమ్ మిర్రర్ కాపు కాస్తుంది
మహేశ్వరం ,క్రైమ్ మిర్రర్:- మహేశ్వరం గేటు నుంచి మహేశ్వరం వెళ్ళాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పోవాల్సిందే.. విశాలమైన రోడ్లు ఉన్న రోడ్ల మరమత్తులలో నిర్లక్ష్యం వహిస్తున్నారని వాహన దారుల ఆరోపణ. మహేశ్వరం గేటు నుండి మహేశ్వరం వెళ్ళే ప్రధాన రహదారిలో మదర్సా సమీపంలో ప్రమాద కారణంగా ఉన్న కల్వర్ట్, కల్వర్ట్ దగ్గర వర్షపు నీరు,దానికి తోడు మాంఖల్ పారిశ్రామిక వాడ నుండి వెలువడే వృదా నీరు రావడంతో రోడ్డు కోయలు కోరడంతో ప్రమాదకరంగా మారింది.రాత్రి సమయంలో వెళ్ళాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవలసిందే నని, పండగ వేళ గ్రామాలకు వెళ్లే వారు జాగ్రతలు తీసుకోవాలి.ప్రమాదాన్ని అరికట్టడానికి కల్వర్టుని మరమత్తులు చేయించాలని,లేదా కల్వర్ట్ సమీపంలో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని వాహన దారులు కోరుతున్నారు.
Read also ‘ ఆమనగల్లు గ్రామంలో రెచ్చిపోతున్న అక్రమ ఇసుక,మట్టి మాఫియా
Read also : వాళ్లంతా శాంతించే వరకు పవన్ కళ్యాణ్ కు జ్వరం తగ్గదులే : యాంకర్ శ్యామల