క్రైమ్జాతీయం

దండకారణ్యం మళ్లీ దద్దరిల్లింది – కేంద్రం "ఆపరేషన్ కగార్" కొనసాగుతోంది

నారాయణపూర్‌లో భీకర ఎన్‌కౌంటర్: 25 మావోయిస్టుల మృతి

నారాయణపూర్, ఛత్తీస్‌గఢ్ : ఒక భారీ ఎన్‌కౌంటర్‌లో 25 మంది మావోయిస్టులు మృతి చెందారు. భద్రతా బలగాలు మరియు మావోయిస్టుల మధ్య నేడు ఉదయం నుంచి భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పులు నారాయణపూర్ జిల్లాలోని అబుజ్మద్ అడవుల్లో జరిగినట్లు సమాచారం.

ఈ భారీ ఆపరేషన్‌లో బీజాపూర్, నారాయణపూర్, దంతేవాడ జిల్లాల నుండి వచ్చిన డిస్ట్రిక్ట్ రిజర్వ్‌ గార్డ్ (DRG) బలగాలు పాల్గొన్నాయి. భద్రతా వర్గాలు తెలుపుతున్న ప్రకారం, ఈ ఎదురుకాల్పుల్లో మరికొంతమందికి తీవ్ర గాయాలు కావడం, మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

స్పెషల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా మావోయిస్టుల టాప్ నాయకులు బటైల్ అడవుల్లో ఉన్నట్లు గుర్తించిన భద్రతా బలగాలు, ముందస్తు ప్రణాళికతో ఈ చర్యలు చేపట్టారు. ఈ ఎన్‌కౌంటర్‌ను అబుజ్మద్ ఎస్పీ ప్రభాత్ కుమార్ ధృవీకరించారు. బస్తర్ ప్రాంతంలోని నాలుగు జిల్లాల నుంచి ఉమ్మడి బలగాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయని చెప్పారు. ఈ ఘటనను మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బగా భద్రతా వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన “ఆపరేషన్ కగార్” గణనీయమైన పురోగతిని నమోదు చేస్తోందని అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button