ఫార్మూలా ఈ కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ను ఏసీబీ విచారించింది. ఈనెల 16న ఈడీ ముందుకు కేటీఆర్ వెళ్లనున్నారు. ఈ కేసులో కేటీఆర్ అరెస్ట్ ఖాయమనే ప్రచారం సాగుతోంది. ఈ సమయంలోనే సీఎం రేవంత్ రెడ్డికి ఝలక్ ఇచ్చారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్.. అధికార కాంగ్రెస్ లో చేరారు. అయితే ఫార్మూలా ఈ కార్ రేస్ అంశంతో పాటు కేటీఆర్ పై నమోదైన కేసు విషయంలో తాజాగా నాగేందర్ చేసిన కామెంట్లు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి.
ఫార్ములా ఈ కార్ రేసు విషయంలో రేవంత్ రెడ్డికి జలక్ ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యే దనం నాగేందర్. ఫార్ములా-ఈ రావడం వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందన్నారు. అప్పట్లోనే ఫార్ములా- 1 తీసుకు రావాలని చంద్రబాబు గచ్చిబౌలిలో భూసేకరణ చేశారు.. కానీ కొన్ని కారణాల వల్ల రాలేదని చెప్పారు. ఫార్ములా-ఈ రావడం వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది అనేది మాత్రం నిజం అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్
అసెంబ్లీలో ఇటీవల దానం నాగేందర్ చేసిన కామెంట్లు దుమారం రేపాయి. ఆ ఘటనపై స్పందించారు దానం నాగేందర్. అప్పుడు అసెంబ్లీలో ఆవేశంలో నోరు జారాను.. దానికి కేటీఆర్ గారిని వ్యక్తిగతంగా కలిసి సారీ చెప్పానని చెప్పారు. ఓ యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఈ వ్యాఖ్యలు చేశారు.