
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొంథా తుఫాన్ తీవ్ర ప్రభావాన్ని చూపుతున్న నేపథ్యంలో జాతీయ రహదారిపై ప్రయాణించేటువంటి భారీ వాహనాలకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కీలక హెచ్చరికలు జారీ చేసింది. మొంథా తుఫాన్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జాతీయ రహదారిపై ప్రయాణించేటువంటి భారీ వాహనాలు ఈరోజు రాత్రి 7 గంటల తర్వాత నిలిపివేయనున్నట్లుగా కీలక ప్రకటన చేసింది. కాబట్టి ఈ భారీ వాహనాలు నడుపుతున్న వారు అందరూ కూడా ఈ హెచ్చరికలను గుర్తుంచుకొని ముందుగానే వాటిని సురక్షిత ‘లేబే’ ల్లో పార్కు చేసుకోవాలని సూచించారు.
రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ నిర్ణయం మేరకు భారీ వాహనాలు నడుపుతున్న వారు వీటిని గుర్తించి ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భారీ వాహనాలు అయినటువంటి లారీలు, ప్రైవేట్ బస్సులు వంటి భారీ బరువులను మోసేటువంటి వాహనాలను రాత్రి 7 గంటల తర్వాత జాతీయ రహదారిపై నిలిపివేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు ప్రజలు అత్యవసరమైతే తప్ప నేడు మరియు రేపు దూరపు ప్రయాణాలు చేయవద్దు అని మరోసారి తీవ్రంగా హెచ్చరించింది.
తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో భారీ వాహనాల వల్ల జాతీయ రహదారులపై ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉండడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. కాగా ఈ తుఫాన్ ఈరోజు రాత్రి కాకినాడ తీరం దాటే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.
Read also : రాజకీయ విభేదాలతో.. అంత్యక్రియలకు దూరంగా ఉన్న కవిత!?
Read also : 10 లక్షల అప్పు.. ఏం చేయాలో తోచని పరిస్థితి.. సరదాగా AI ని ప్రశ్నించాడు.. చివరికి?





