Monday, March 2, 2026
Homeఆంధ్ర ప్రదేశ్Cyclone Ditwah: ఏపీ వైపు దూసుకొస్తున్న ‘దిత్వా’ తుఫాన్, పలు జిల్లాలకు రెడ్ అలర్ట్!

Cyclone Ditwah: ఏపీ వైపు దూసుకొస్తున్న ‘దిత్వా’ తుఫాన్, పలు జిల్లాలకు రెడ్ అలర్ట్!

‘దిత్వా’ తుఫాన్‌ ఏపీ మీద తీవ్ర స్థాయిలో ప్రభావం చూపించబోతోంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమల్లోని పలు జిల్లాలకు తీవ్ర వర్ష ముప్పు పొంచి ఉంది. ఆది, సోమవారాల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు భారత వాతావరణ శాఖ, విపత్తు నిర్వహణ సంస్థలు కీలక ప్రకటన చేశాయి.

పలు జిల్లాలకు రెడ్ అలర్ట్

దిత్వా తుఫాన్ కారణంగా నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు ఐఎండీ రెడ్‌ అలర్ట్‌ జారీచేసింది. తుఫాన్‌ ప్రభావంతో రాత్రి నుంచి నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు, ఈదురుగాలులు ప్రారంభమయ్యాయి.  అర్ధరాత్రి తర్వాత వర్షాలు పెరిగాయి. తీర ప్రాంతాల్లో 50-70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. దిత్వా తుఫాన్‌ తీవ్ర వాయుగుండంగా మారి  తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు చేరుకుంది. దీనిప్రభావంతో రానున్న 48 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున తీరం దిశగా అలలు ఎగిసిపడుతున్నాయి. సోమవారం వరకూ మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. కృష్ణపట్నం పోర్టులో మూడు, మిగిలిన ఓడరేవుల్లో రెండో నంబరు హెచ్చరిక జారీ చేసింది.

ప్రభుత్వం అలర్ట్.. సీఎస్ కీలక ఆదేశాలు

దిత్వా తుఫాన్ నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. జిల్లా కలెక్టర్లతో సీఎస్ విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో ప్రజలు, రైతులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని ఆదేశించారు. తుఫాన్‌ తీవ్రతను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ.. ప్రభావిత జిల్లాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత ఆదేశించారు.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments