Monday, March 23, 2026
Homeక్రైమ్Cyber Fraud: సైబర్ వలలో మాజీ డీజీపీ మనుమరాలు, ఏకంగా రూ.1.20 కోట్లు మాయం!

Cyber Fraud: సైబర్ వలలో మాజీ డీజీపీ మనుమరాలు, ఏకంగా రూ.1.20 కోట్లు మాయం!

Ex-DGP’s Granddaughter Cyber Fraud: ఓ మాజీ డీజీపీ మనుమరాలికి సైబర్‌ నేరగాళ్లు టోకరా వేశారు. ఆమె అకౌంటెంట్‌ను బురిడీ కొట్టించి రూ.1.20 కోట్లు కాజేశారు. ఈ నెల 13న బాధితురాలి ఫోటో డీపీగా ఉన్న నంబర్‌ నుంచి కంపెనీ అకౌంటెంట్‌ వాట్సాప్‌కు సందేశం వచ్చింది. తాను ముఖ్యమైన సమావేశంలో ఉన్నానని, తాను చెప్పిన ఖాతాకు వెంటనే రూ.1.20 కోట్లు బదిలీ చేయాలని అందులో ఉంది. మెసేజ్‌ తమ డైరెక్టర్‌ నుంచి వచ్చిందని భావించిన సదరు అకౌంటెంట్‌ వెంటనే రూ.1.20కోట్లు బదిలీ చేశాడు.

కొనసాగుతున్న విచారణ

అనంతరం, మరోసారి డబ్బు పంపాలంటూ అదే నంబర్‌ నుంచి మార్చి 17న మళ్లీ మెసేజ్ వచ్చింది. అయితే, డైరెక్టర్‌ కార్యాలయంలోనే ఉండడంతో చెక్‌ అప్రూవల్‌ కోసం అకౌంటెంట్‌ ఆమెను నేరుగా సంప్రదించారు. ఈ సందర్భంగా రూ.1.20 కోట్ల విషయం ప్రస్తావించగా.. తాను ఎలాంటి మెసేజ్ పంపలేదని బాధితురాలు చెప్పారు. దీంతో అకౌంటెంట్‌ తనకు వచ్చిన మెసేజ్, లావాదేవీ వివరాలను చూపించారు. అయితే, సైబర్‌ మోసాన్ని గుర్తించిన బాధితురాలు వెంటనే 1930కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న సీపీ సజ్జనార్‌ ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేశారు.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments