
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- నిన్న, మొన్నటి వరకు సామాన్యులకు షాక్ ఇచ్చినటువంటి సైబర్ నేరగాళ్లు ఇప్పుడు రాజకీయ పార్టీలకు షాక్ ఇస్తున్నారు. తాజాగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్ ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఈ విషయాన్ని శనివారం అర్ధరాత్రి తర్వాత జనసేన సోషల్ మీడియా గుర్తించినట్లుగా జనసేన పార్టీ అఫీషియల్ గా తెలిపింది. ఆ ఎకౌంట్లో పార్టీ కార్యకలాపాలు అలాగే పవన్ కళ్యాణ్ అధికారిక కార్యక్రమాల పోస్టులు ఉంటాయి. కానీ నిన్న రాత్రి సమయంలో ఆ ఎక్స్ అకౌంట్లో ఇన్వెస్ట్మెంట్స్ మరియు ట్రేడింగ్ కు సంబంధించినటువంటి ట్వీట్స్ కనిపిస్తుండడంతో.. ఒక్కసారిగా పార్టీ కార్యకర్తలు అలాగే నాయకులందరూ కూడా షాకు కు గురయ్యారు. ఈ విషయాన్ని గుర్తించిన పార్టీ ముఖ్య నాయకులు సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం అందింది. ఇప్పటికే ఎంతోమంది ప్రజలను ఈ సైబర్ నేరగాళ్లు విస్తృత స్థాయిలో మోసాలు చేస్తున్నారు. తాజాగా రాజకీయ పార్టీల పైన కూడా కన్ను వేయడంతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ రాజకీయ నాయకులు కూడా వీటిపై జాగ్రత్త వహిస్తున్నారు. సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలీసులు విస్తృత స్థాయిలో వీటికి అడ్డుకట్ట వేయాలని ప్రయత్నిస్తున్న కూడా అవి ఆగే అవకాశం కనిపించడం లేదు.
Read also : బీహార్ ఎన్నికల ఎఫెక్ట్.. తెలంగాణలో లోడింగ్, అన్లోడింగ్ సమస్యలు!
Read also : రైతులకు నష్టపరిహారం పెంచుతున్నాం : మంత్రి అచ్చన్న





