క్రైమ్వైరల్సినిమా

అమ్మ సెంటిమెంట్ తో మ్యూజిక్ డైరెక్టర్ ను మోసం చేసిన సైబర్ నేరగాళ్లు?

క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్లు విస్తృత ప్రయోగాలతో చాలామందిని మోసం చేస్తున్నారు. మొన్నటి వరకు సామాన్యులను మోసం చేసిన సైబర్ నేరగాళ్లు తాజాగా సెలబ్రిటీలను సైతం వదలడం లేదు. ఇప్పటికే సామాన్యుల తో పాటు ఎంతో మంది రాజకీయ నాయకులను మోసం చేసిన నేరగాళ్లు తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ ను అమ్మ సెంటిమెంట్ తో మోసం చేశారు. ఇక అసలు వివరాల్లోకి వెళితే.. మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ ను ఎవరో గుర్తు తెలియని ఒక వ్యక్తి సోషల్ మీడియా వేదికగా సహాయాన్ని కోరాడు. ఒక ఫోటోను షేర్ చేసి ఈ ఫోటోలో ఉంది మా అమ్మ.. చనిపోయింది అని అంత్యక్రియలకు డబ్బులు లేవు అని మెసేజ్ పెట్టగా… ఈ మెసేజ్ కు చలించిపోయినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ వెంటనే అతను చెప్పిన నెంబర్ కు 20వేల రూపాయలు పంపించారు.

Read also : రెండో రోజు మ్యాచ్ లో ఒక స్టార్ డక్ ఔట్, మరో స్టార్ విజృంభన!

ఇక ఆ తరువాత ఆ ఫోటో 2022లో పోస్ట్ చేసింది అని.. అది చూసుకోకుండా ఆ వ్యక్తికి డబ్బులు కొట్టాను అని తర్వాత జీవి ప్రకాష్ గ్రహించారు. అమ్మ పేరుతో చివరికి మోసాలు కూడా చేస్తున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా కూడా అమ్మ సెంటిమెంటుతో అంత్యక్రియలకు డబ్బులు అడిగిన వ్యక్తికి ఒక్క మాట కూడా అడగకుండా డబ్బులు కొట్టిన మ్యూజిక్ డైరెక్టర్ ను చాలా మంది సోషల్ మీడియా వేదికగా ప్రశంసిస్తున్నారు. అలాగే అమ్మ పేరుతో మోసం చేయడం పై సైబర్ నేరగాల పట్ల చాలామంది నిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇలాంటి వారిని ఊరికి వదలకూడదు అని.. ఇలాంటి వారి వల్ల నిజంగా అవసరమైనటువంటి వారికి కూడా నమ్మకం లేక సహాయం చేయలేకపోతున్నాము అని మరికొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాను ఉపయోగించుకొని చాలామంది సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతూ డబ్బును లూటీ చేస్తున్నారు. ప్రజలు కూడా ఎవరికైనా డబ్బులు పంపే ముందు ఒకటికి రెండుసార్లు చూసుకోవాలి అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 నెంబర్ కు కాల్ చేయాలని సూచించారు.

Read also : 2038 నాటికి భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుంది : సీఎం చంద్రబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button