
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- మన దేశవ్యాప్తంగా కొంతమంది సైబర్ నేరగాళ్లు బరితెగించి మరి సెలబ్రిటీలను అన్ని రంగాలలో ఉపయోగించుకుంటున్నారు. ఇప్పటివరకు సాదాసీదా మనుషులను వాడుకొని డబ్బులను దోచేసిన వారు.. ఇప్పుడు సెలబ్రిటీల వైపు దృష్టి మల్చారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి విషయంలో సైబర్ నేరగాళ్ళు బరితెగించినట్లు తెలుస్తుంది. కొన్ని డీప్ ఫేక్ వీడియోస్ సృష్టించి ఏకంగా పోర్న్ సైట్లలో పెట్టడంతో చిరంజీవితో పాటుగా చిత్ర పరిశ్రమంలోని వారందరూ కూడా షాక్ అవుతున్నారు. ఈ డీప్ ఫేక్ వీడియోలో.. చిరంజీవి ఒక మహిళతో ఇంటిమేట్ సీన్లలో పాల్గొన్నట్లుగా ఉండడంతో ప్రతి ఒక్కరు కూడా చూసి షాక్ అవుతున్నారు. దీంతో వెంటనే బరితెగించిన సైబర్ నేరగాలను వెంటనే అరెస్ట్ చేయాలంటూ చిరంజీవి నేరుగా సీపీ సజ్జనార్ ను కలిసి వివరించారు. ఈ డీప్ ఫేక్ వీడియోలు నా గౌరవానికి భంగం కలిగించాయంటూ.. వెంటనే వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు చిరంజీవి. సైబర్ క్రైమ్ పోలీసులు ఎప్పటికప్పుడు ఇలాంటి వీడియోలు బయటకు రానివ్వకుండా పలు వెబ్సైట్లను బ్యాన్ చేయాలని సూచించారు. కాగా ఈ మధ్య ఏఐతో ఫేక్ వీడియోలు చేయడం చాలా ఫ్యాషన్ గా మారిపోయింది. కొంతమంది ఏ ఐ తో కొన్ని అద్భుతాలు చేస్తూ మంచి పనులుగా ఉపయోగిస్తుంటే… మరికొందరు మాత్రం చాలా దారుణానికి ఒడి కడుతున్నారు. దీంతో ఈ సైబర్ నెరగాలను అంతం చేసేలా ఒక స్పెషల్ టీం ను తీసుకురావాలని చాలామంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.
Read also : తెలంగాణలో బాధాకర ఘటన… చెల్లిని అమ్మొద్దు అంటూ తల్లిదండ్రులను వేడుకున్న కూతుర్లు!
Read also : గాయం కారణంగా ప్రతీకా అవుట్.. ఆమె ప్లేస్ లోకి కీలక ప్లేయర్?





