
Cultural Controversy: ఒడిశా రాష్ట్రం గాంజాం జిల్లా దిగపొహండి సమితిలో మౌళాభంజ గ్రామంలో ఇటీవల జరిగిన సాంస్కృతిక యాత్రలో ‘రామాయణం’ నాటక ప్రదర్శనలు తీవ్ర వివాదానికి కారణమయ్యాయి. ఈ ప్రదర్శనలో కళాకారులు హద్దు దాటిన ప్రవర్తనతో, పౌరాణిక నాటకానికి అనుచితమైన అంశాలు చేర్చారు. సీత, ఇతర పవిత్ర పాత్రధారిణులతో అనుచిత చర్యలు, అశ్లీల నృత్యాలు ప్రదర్శించబడటంతో స్థానికులు, కళా సమాజం ఆవేదన చెందారు.
ఐటమ్ గర్ల్ నిషా మహరణా, హిజ్రా వేషధారులు అశ్లీల నృత్యాలను ప్రదర్శించారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దాంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. స్థానిక సాంస్కృతిక కార్యక్రమ నిర్వాహకులు రెండు నాటక బృందాలను ఏర్పాటుచేశారు. ఈ బృందాలు యాభై గంటలపాటు నిరవధికంగా, పోటాపోటీగా నాటకాలను ప్రదర్శించాయి.
ప్రదర్శనలో నాటకంలో సీత పాత్రధారిణిని రావణుడు ఆమె శరీరంలో పలు చోట్ల తాకుతూ, చుంబిస్తూ హద్దు దాటి అశ్లీలతను ప్రదర్శించాడు. నిషా మహరణా, ఇతర వేషధారులు అర్ధనగ్న రూపంలో నృత్యాలు ప్రదర్శించారు. అలాగే, కొన్ని వేషధారులు క్రేన్ పై ఎక్కి ప్రమాదకర విన్యాసాలు చేశారు.
రంగస్థల దర్శకులు, ఆల్ ఇండియా థియేటర్ కౌన్సిల్ జాతీయ ఉపాధ్యక్షుడు రాజ్‌గోపాల్ పాఢి మాట్లాడుతూ.. రామాయణం వంటి పవిత్ర పౌరాణిక నాటకాల్లో అశ్లీల ప్రదర్శనలు అత్యంత అపవిత్రమని, ఇలాంటి కార్యక్రమాలను నిరోధించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రదర్శకులు సమాజాన్ని, పౌరాణిక సంప్రదాయాలను గౌరవించాలి అని ఆయన సూచించారు.
ALSO READ: ATM Fraud: దొరికిన ఏటీఎం కార్డుతో నగదు విత్ డ్రా.. ఆ తర్వాత ఏమైందంటే..?





