పడిపోయిన రూపాయి విలువ
దేశీయ మార్కెట్ల పై తీవ్ర ప్రభావం
న్యూఢిల్లీ, క్రైమ్ మిర్రర్: పశ్చిమాసియాలోని ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర వంద డాలర్లు దాటింది. చమురు దిగుమతి చేసుకోవడంలో ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్న భారత్‌పై తీవ్ర పడునుందనే అంచనాలతో మదుపర్లను తీవ్రంగా కలవరానికి గురి చేస్తున్నాయి.
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లు తీవ్ర ఒత్తిడిలో ఉండడం, డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి భారీగా పతనమవడం దేశీయ సూచీలపై నెగిటివ్ ప్రభావం చూపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సెన్సెక్స్, నిప్టీ భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. గత సెషన్ ముగింపు (78,918)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం దాదాపు 2000 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత పతనమైంది.
మరో ఆరు వందల పాయింట్లు కిందకు వెళ్లింది. చాలా రోజుల తర్వాత సెన్సెక్స్ 70,000 పాయింట్ల దిగువకు పడిపోయింది. ప్రస్తుతం ఉదయం 10:00 గంటల సమయంలో సెన్సెక్స్ 2037 పాయింట్ల నష్టంతో 76,881 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిప్టీ కూడా భారీగా నష్టపోయింది. 2.5 శాతానికి పైగా పడిపోయింది. ప్రస్తుతం 624 పాయింట్ల నష్టంతో 23,826 వద్ద కదలాడుతోంది.
సెన్సెక్స్, నిప్టీలో ఎమ్‌సీఎక్స్ ఇండియా, కోల్ ఇండియా మొదలైన షేర్లు మాత్రమే స్వల్ప లాభాల్లో ఉన్నాయి . ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, యూనో మిండా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ, హిందుస్థాన్ పెట్రో మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. నిప్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1587 పాయింట్ల నష్టంతో ఉంది. బ్యాంక్ నిప్టీ 2280 పాయింట్ల నష్టంతో ఉంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 92.32గా ఉంది
