
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- వనపర్తి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వనపర్తి జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు అన్నారు. ముఖ్యంగా వరిసాగు చేసిన రైతులు రాబోయే 2,3 రోజుల్లో కోతలు వాయిదా వేసుకోవాలన్నారు. ఇప్పటికే కోసిన పంటను సురక్షిత స్థలంలో ఉండేలా చూసుకోవాలని అన్నారు. ఉరుములు, పిడుగులు పడే అవకాశం ఉన్నందున రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కాగా తూఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తో పాటుగా.. తెలంగాణ లోనూ పెద్ద ఎత్తున చూపుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు, రేపు చాలా అంటే చాలా అప్రమత్తంగా ఉండాలి అని కోరారు.
Read also : తుఫాన్ ఎఫెక్ట్… భారీ వాహనాలకు ప్రభుత్వం షాకింగ్ న్యూస్
Read also : రాజకీయ విభేదాలతో.. అంత్యక్రియలకు దూరంగా ఉన్న కవిత!?





