తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో ఒక వింత ఘటన జరిగింది. జగిత్యాల ప్రధాన ఆసుపత్రిలో రోగులను పట్టించుకోకుండా నర్సులు చేసినా వ్యవహారం చూస్తే అందరూ కూడా ఆశ్చర్య పోవాల్సిందే. ఎందుకంటే ఆసుపత్రిలోనే రోగులను పట్టించుకోకుండా వాళ్ళు చేసిన డాన్స్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి. ఇక అసలు విషయం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మూడో టెస్ట్ ఆరంభంలోనే భారీ వర్షం!.. పరిస్థితి ఏంటి?
ఆసుపత్రిలోని రోగులను పట్టించుకోకుండా అక్కడ ఉన్నటువంటి నర్సులు మరియు సిబ్బంది క్రిస్మస్ వేడుకల కోసం డాన్స్ ప్రాక్టీస్ చేశారు. పేషెంట్లను పట్టించుకోకపోవడమే కాకుండా రోగులు ఉన్నటువంటి పక్క రూములోనే పాటలు పెట్టుకొని మరీ నృత్యాలు చేశారు. కర్రలతో కోలాటం టైపులో పాటలకి డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. ఇక ఈ వీడియో వైరల్ అవ్వడంతో ఏకంగా కలెక్టర్ దృష్టికి వెళ్ళింది.
ప్రకాశం జిల్లా లో IIIT విద్యార్థి మృతి!..
జిల్లా ఎడిషనల్ కలెక్టర్ గౌతమ్ రెడ్డి ఈ వైరలైన వీడియో పై తక్షణమే విచారణకు ఆదేశించారు. తక్షణమే విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతుండగా రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మరి కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా సరే ఆసుపత్రిలో రోగులను పట్టించుకోకుండా ఇలాంటి డాన్సులు చేయడం ఏంటని చాలామంది ప్రశ్నిస్తున్నారు.