క్రైమ్ మిర్రర్ తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ (2BHK) ఇళ్లను అమ్మినా లేదా అద్దెకు ఇచ్చినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. కేవలం తర్వాతి తరానికి వారసత్వంగా మాత్రమే అందించగలరు.
ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం పేద, నిరాశ్రయులైన కుటుంబాలకు శాశ్వత గృహవసతిని కల్పించడం, తద్వారా వారు అద్దె చెల్లించే భారం నుండి విముక్తి పొందడం. ఈ ఇళ్లు నిరుపేద కుటుంబాలకు ఉచితంగా, గౌరవప్రదమైన గృహవసతి కల్పించే “గౌరవ గృహనిర్మాణ పథకం” (Dignity Housing Scheme) కింద కేటాయించబడ్డాయి.
ఇళ్లను అద్దెకు ఇచ్చినట్లు లేదా విక్రయించినట్లు తేలితే, ఆ ఇంటి కేటాయింపును ప్రభుత్వం రద్దు చేస్తుందిని సమాచారం. అలాగే డబ్బు ఆశచూపి ఇళ్లను విక్రయించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. ఈ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే ప్రభుత్వం ఇళ్లను తిరిగి స్వాధీనం చేసుకుంటుందని అధికారులు స్పష్టం చేశారు.