
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- మన రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఏం జరుగుతుందో తెలియట్లేదని బీఆర్ఎస్ నేత కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటినుంచి తెలంగాణలో క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకే ఒక వారంలో అది కూడా కేవలం ఒక్క హైదరాబాదులో మాత్రమే రెండు షాకింగ్ క్రైమ్స్ జరిగాయని కేటీఆర్ వెల్లడించారు. పట్టపగలే దుండగులు రెచ్చిపోయి దొంగతనాలు చేయడమే కాకుండా నేరుగా హత్యలు చేస్తున్నారని మండిపడ్డారు. తాజాగా మిట్ట మధ్యాహ్నం ఒక జువెలరీ షాప్ లో చోరీ జరిగిందని అన్నారు. మరోవైపు కూకట్పల్లిలో 12 ఏళ్ల బాలిక హత్య ఘటనలు చోటు చేసుకున్నాయి. మరీ ఇంత ఘోరంగా పట్టపగలే ఇలాంటి దారుణాలు జరుగుతుంటే.. ఇక ప్రజలు ఏ విధంగా ధైర్యంతో ఉండగలరు అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం నుండి రక్షణ కావాలి కానీ… ప్రభుత్వాన్ని చూసి ప్రజలు భయపడకూడదని అన్నారు. నేరాలు సమర్థవంతంగా ఎదుర్కొనే పోలీసులను.. లా & ఆర్డర్ కోసం, రాజకీయ అవసరాలకు ఉపయోగించుకుంటే ఇలాంటి ఫలితాలనే చూడాల్సి ఉంటుందని ప్రజలకు విన్నపించారు.
Read also : మరో వారంలో పండుగ.. విగ్రహాల తరలింపు క్రమంలో కరెంట్ షాక్ కు ముగ్గురు బలి!
కాగా ఈ మధ్య హైదరాబాదులోని కూకట్పల్లిలో ఒక ఇంట్లో ఒంటరిగా ఉన్నటువంటి 12 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో బాలిక ఇంట్లోకి ఒక యువకుడు వెళ్లడం సీసీ కెమెరాలో కూడా రికార్డు అయింది. బాలికపై ఆ యువకుడు లైంగిక దాడి కి ప్రయత్నించగా.. ఆ చిన్నారి ఎదురు తిరగడంతో ఆగ్రహానికి గురైన యువకుడు కత్తితో పొడిచి వెంటనే పరారైనట్లు తెలుస్తుంది. ఆ యువకుడు బాలిక కుటుంబానికి దగ్గర బంధువు అని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ఈ దారుణమైన ఘటన కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతోనే బీఆర్ఎస్ నేత కేటీఆర్ మీడియా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం పై మండిపడ్డారు.
Read also : విద్యాశాఖను గాలికొదిలేశారు.. సీఎం రేవంత్ పై అకునూరి మురళీ సీరియస్