
నూతనకల్, క్రైమ్ మిర్రర్ :- నూతనకల్ మండలం, చిల్పకుంట్లలో సిపిఎం పార్టీ సత్తా చాటింది. పంచాయితీ ఎన్నికల్లో సిపిఎం ఒంటరిగా పోటీ చేయగా, కాంగ్రెస్ టిఆర్ఎస్ సీపీఐ(ఎంఎల్ న్యూ డెమోక్రసీ) పార్టీలు ఉమ్మడిగా పోటీలో దిగాయి. సర్పంచ్ ఎన్నికల్లో సిపిఎం పార్టీ అభ్యర్థి అంజపల్లి నర్సమ్మ తన సమీప ప్రత్యర్థి బత్తుల పద్మపై 52 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.12 వార్డులో 8 వార్డులను సిపిఎం పార్టీ గెలుచుకొని తన సత్తాను చాటింది. కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలతో పాటు చిల్పకుంట్ల గ్రామ పంచాయితీ ఎన్నికల్లో గెలుపొందడం పట్ల పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
Read also : మార్పు కోరిన ప్రజలు.. పాలకూరి రమాదేవి,నరసింహ గౌడ్ ఘన విజయం
Read also : Modi-Putin Selfie: మోడీ-పుతిన్ సెల్ఫీ.. ట్రంప్ పై అమెరికన్ల విమర్శలు!





