లగచర్ల ఫార్మాసిటీ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు అన్యాయం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని సీపీఎం జాతీయ కార్యదర్శి తమ్మినేని సీతారాం అన్నారు. లగచర్లలో ఉన్న భూములు రెండు పంటలు పండే సారవంతమైన భూములని చెప్పారు. సారవంతమైన భూములు తీసుకోకూడదని చట్టం చెబుతున్నా అధికారులు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఫార్మా కంపెనీనీ వ్యతిరేకిస్తే నిర్బంధించి జైలు పాలు చేస్తున్నారని తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు.
ప్రభుత్వం చేపట్టిన ఫోర్త్ సిటీ కావచ్చు హైడ్రా కావచ్చు మూసి ప్రక్షాళన కావచ్చు దామగుండం ప్రాజెక్టు కావచ్చు ఏదైనా సరే ప్రతిపక్ష పార్టీలతో సంప్రదించి చర్చించి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని సీఎం రేవంత్ కు సూచించామన్నారు తమ్మినేని. ఏకపక్ష నిర్ణయం తీసుకుంటే ఆయనకే నష్టమని చెప్పామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.
ఇకనైనా సంక్షేమ పథకాల అమలు విషయంలో వేగం పెంచాలన్నారు. ఒకటి రెండు వాగ్దానాలు తప్ప ఏవి అమలు జరగలేదు ఇచ్చిన హామీలను త్వరలోనే నెరవేర్చాలన్నారు. అలా ఇచ్చిన హామీలను నెరవేర్చలేని పక్షంలో వామపక్షాలతో చర్చలు జరిపి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామన్నారు.
అలాగే హైదరాబాద్ లో హైడ్రా పేరుతో కూల్చివేసిన ఇండ్లకు ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించాలని తమ్మినేని డిమాండ్ చేశారు.
ఇల్లు కట్టుకోవడానికి పరిమిషన్ ఇచ్చిన జిహెచ్ఎంసి కానీ ఎలక్ట్రిక్ బోర్డు వారు ఆమోదించిన స్థలాల్లో ఇల్లు కట్టుకున్నారు.అలా కట్టడం అక్రమము అయితే ముందుగా పర్మిషన్ ఇచ్చిన అధికారులను సస్పెండ్ చేయాలన్నారు. అలా చేయకుండా అన్యాయంగా అక్రమంగా కష్టపడి సంపాదించిన డబ్బులతో ఇండ్లు కట్టుకున్న ప్రజలను నిరాశ్రయులు చేయడం సభబు కాదని అన్నారు. నష్టపోయిన వారికి కచ్చితంగా నష్టపరిహారం అందించాలని తమ్మినేని డిమాండ్ చేశారు.
మరిన్ని వార్తలు చదవండి…
గజగజ వణుకుతున్న జనాలు.. తెలంగాణలో చలి పంజా
పాతబస్తీలో నేను చెప్పిందే ఫైనల్.. మేయర్‌కు MIM ఎమ్మెల్యే వార్నింగ్
డేంజర్ లో హైదరాబాద్.. బయటికి వస్తే అంతే
రైతుల సంబరం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
సచివాలయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఘోర అవమానం
రేవంత్ టచ్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. జంప్ అయ్యేది వీళ్లే..!