తెలంగాణ

భూములు అమ్మితే ఒప్పుకోం.. రేవంత్ కు సీపీఐ ఝలక్

కంచ గచ్చిబౌలి భూముల వివాదం తెలంగాణలో కాక రేపుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. విద్యార్థి సంఘాలు, విపక్షాలు, పర్యావరణ వేత్తలు, సినీ సెలబ్రెటీలు చెట్లు నరికివేయడాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డికి మిత్రపక్షం సీపీఐ కూడా ఝలక్ ఇచ్చింది. హెచ్ సీయూ భూముల వివాదంలో ప్రభుత్వానిని ఘాటు హెచ్చరిక చేశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూములకు సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తున్న హెచ్ సి యు విద్యార్థుల ప్రతినిధి బృందంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చించాలని కూనంనేని సూచించాపు. అవి హెచ్ సి యు భూములని విద్యార్థులు అంటుండగా, అవి రాష్ట్ర ప్రభుత్వానివేనని ప్రభుత్వం అంటున్నది. ఆ 400 ఎకరాలకు బదులుగా, వర్సిటీకి అంతే మొత్తంలో భూములు ఇచ్చామని రాష్ట్ర ప్రభుత్వం రికార్డులు చూపిస్తున్నది. దీనిపై సందేహాలను నివృత్తి చేసేందుకు విద్యార్థుల ప్రతినిధి బృందంతో చర్చించి, వారి అభిప్రాయాలను స్వీకరించాలని చెప్పారు.

అదే సమయంలో వర్సిటీ విద్యార్థులపై పోలీసుల బలప్రయోగాన్ని ఖండిస్తున్నాం. అరెస్టయిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలి. వారిపై కేసులు పెడితే ఉపసంహరించుకోవాలి. భూముల అమ్మకం విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలి. ఇలాంటి ఆందోళనలను తలెత్తినప్పుడు సామసరస్యంగా పరిష్కరించడం మంచిది. ప్రభుత్వం ముందుకొచ్చి మాట్లాడితే మంచి సంకేతాలు ఇచ్చినట్లు అవుతుంది. ఇలాంటి సున్నితమైన అంశాలు విషయంలో పోలీసులు అతిగా ప్రవర్తించవద్దు. దాని వల్ల సమస్య జఠిలమవుతుంది. విద్యార్థులకు సహజంగానే ఆందోళన ఉంటుంది. దానిని అర్థం చేసుకొని పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తన లేఖలో పేర్కొన్నారు కూనంనేని సాంబశివరావు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button